Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: June 21, 2020, 3:02 PM IST
నయనతార (Nayanthara)
స్టార్ హీరోయిన్ నయనతారకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రచారం జోరందుకుంది. అసలే తమిళనాడులో ఎక్కువగా ఉండటంతో ఏమో నిజమేమో అని అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. పైగా రూమర్స్ వచ్చినపుడు కూడా స్పందించకుండా ఉంటే అది నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్నారు కూడా. ఇలాంటి సమయంలో నయనతార పిఆర్ టీం దీనిపై స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసింది టీం. నయనతారకు ఎలాంటి కరోనా సోకలేదని.. ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు టీం.

నయనతార (Nayanthara)
లేనిపోని నిరాధారమైన రూమర్స్ క్రియేట్ చేసి అనవసరంగా అభిమానులను కంగారు పెట్టొద్దంటూ నయనతార టీం కోరుతుంది. ప్రస్తుతం ఈమె లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంది. తమిళనాట కేసులు మరీ దారుణంగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది నయన్. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమాకు కమిటైంది నయన్. ఈ చిత్రం తర్వాత మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అంతలోనే ఇలా కరోనా పాజిటివ్ అనే రూమర్ రావడంతో స్పందించారు స్టార్ హీరోయిన్ పిఆర్ టీం.
First published:
June 21, 2020, 3:02 PM IST