అల్లు ‘రామాయణ్’లో సీత ఎవరో తెలుసా ?

అల్లు అరవింద్ రామాయణం (పైల్ ఫోటో)

అయితే ‘రామాయణ్’సీత పాత్రకు ఎవర్ని ఎంపిక చేస్తారన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై దక్షిణాదికి సంబంధించి ఇద్దరి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ ఫోకస్ పతాకంపై నమిత్ మల్హోత్ర సంయుక్తంగా నిర్మించబోతున్న చిత్రం రామాయణ్. 1500కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో మూడు భాగాలుగా నిర్మించనున్నారు. ఒక్కో భాగానికి 500కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ సినిమాకు నటీనటుల్ని ఇండియా వ్యాప్తంగా వివిధ భాషా చిత్రాల నుంచి ఎంపిక చేసుకుంటారు.

    అయితే ‘రామాయణ్’సీత పాత్రకు ఎవర్ని ఎంపిక చేస్తారన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై దక్షిణాదికి సంబంధించి ఇద్దరి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు నయనతార కాగా... మరొకరు అనుష్క. రామరాజ్యం సినిమాలో సీతగా అలరించిన నయన్‌కు ఆ అవకాశం ఇస్తు బావుంటుందని ఈ సినిమా టీం భావిస్తుంది. మరోవైపు.. బాహుబలి, రుద్రమదేవి, అరుంధతి వంటి సినిమాల్లో తన నటనతో అదరగొట్టిన అనుష్క పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరిలో అల్లు రామాయణంలో ‘సీత’ఎవరో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    ప్రసత్తుం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ప్రపంచస్థాయి నిర్మాణ విలువలతో, అత్యున్నత గ్రాఫిక్స్ హంగులతో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. భారతదేశపు తొలి భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్ ఈ అపురూప కావ్యాన్ని తెర‌కెక్కించే పూర్తి బాధ్యత‌ని తీసుకున్నారు.

    First published: