నయనతార క్యారెక్టర్‌కు ఎసరు పెట్టిన సాహో భామ శ్రద్ధా కపూర్..

నయనతార,శ్రద్ధా కపూర్ (Twitter/Photos)

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార క్యారెక్టర్‌కు సాహో భామ శ్రద్ధా కపూర్ ఎసరు పెట్టబోతుంది. వివరాల్లోకి వెళితే.. 

 • Share this:
  సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార క్యారెక్టర్‌కు సాహో భామ శ్రద్ధా కపూర్ ఎసరు పెట్టబోతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్ర ‘రామయణం’ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సహా వివిధ భాషల్లో రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో  3 భాగాలుగా ‘రామాయణం’ సినిమాను ర్మించనున్న సంగతి తెలిసిందే కదా. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కున్న ఈ  సినిమాలో వివిధ భాషలకు చెందిన నటీనటులు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు ప్రచారం జరగుతోంది. మరోవైపు రావణుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ప్రభాస్‌ను అనుకుంటున్నారు. వీళ్లిద్దరిట్లో ఒకరు చేయడం మాత్రం కన్ఫామ్ అని చెబుతున్నారు. ఈ సినిమాను దంగల్ ఫేమ్ నితిష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్‌తో డైరెక్ట్ చేయనున్నారు.

  సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార క్యారెక్టర్‌కు సాహో భామ శ్రద్ధా కపూర్ ఎసరు పెట్టబోతుంది. వివరాల్లోకి వెళితే.. 
  అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘రామాయణం’(Twitter/photo)


  ఈ సినిమాలో సీత పాత్ర కోసం నయనతార పేరును పరిశీలించారు. ఆల్రెడీ బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించిన అనుభవం ఉండటంతో ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా నయనతార పేరును పరిశీలించారు. ఆ తర్వాత దీపికా పదుకొణే ఈ సినిమాలో సీతగా నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో సీత పాత్ర కోసం ‘సాహో’ భామ శ్రద్ధా కపూర్ పేరును తెరపైకి వచ్చింది. తాజాగా నితిష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిచ్చోరే’ సినిమాలో శ్రద్దాకపూర్‌ నటనకు దర్శకుడు నితిష్ తివారీ ఫిదా అయ్యాడట. అందుకే తాను డైరెక్ట్ చేయబోతున్న‘రామాయణం’ సీత పాత్ర కోసం ఆమె పేరును పరిగణలోకి తీసుకోవాలని చిత్ర నిర్మాతలకు సూచించనట్టు సమాచారం. ఈ సినిమా డిసెంబర్‌లో పట్టాలెక్కనున్ననేపథ్యంలో ఈలోపే  రాముడిగా, రావణాసురుడిగా, సీతగా,మండోదరి వంటి ముఖ్యపాత్రలు ఎవరు చేస్తారనేది ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించారు. 2021లో  ‘రామాయణం’ తొలి భాగం విడుద‌ల కానుంది.

   
  First published: