వాళ్లకు పదేళ్లు దూరంగా గడిపాను.. నయనతార భావోద్వేగం..

లేడీ సూపర్ స్టార్ నయనతారది విభిన్నమైన స్టైల్. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమెకు ఓ ప్రత్యేక వ్యక్తిత్వంతో కూడా గుర్తింపు ఉంది.

news18-telugu
Updated: October 16, 2019, 12:11 PM IST
వాళ్లకు పదేళ్లు దూరంగా గడిపాను.. నయనతార భావోద్వేగం..
సైరాలో నయనతార
news18-telugu
Updated: October 16, 2019, 12:11 PM IST
లేడీ సూపర్ స్టార్ నయనతారది విభిన్నమైన స్టైల్. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమెకు ఓ ప్రత్యేక వ్యక్తిత్వంతో కూడా గుర్తింపు ఉంది. తొలుత మళయాళ సినిమాలో నటించి సినిమా రంగంలోకి ప్రవేశించిన నయనతార.. ఆ తరువాత తెలుగు, తమిళంలో అగ్రహీరోలందరి సరసన నటించారు. అయితే ఆమె మొదటి నుంచి ఏ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. ఆ విషయం సినిమా ప్రారంభానికి ముందే ఆమె చెబుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎంతటి టాప్ హీరో సినిమా అయినా సరే ఆమె తొలి నుంచి అదే పద్దతిని అనుసరిస్తోంది.సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం తమ విధిగా భావిస్తారు మెజారిటీ హీరోయిన్లు. అతికొద్ది మంది మాత్రమే వాటికి దూరంగా ఉంటారు.

నయనతార (twitter/Photo)


ఐతే నయనతార దక్షిణాదిలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్నా.. తీరా ఆ సినిమా ప్రమోషన్స్‌కు మాత్రం హాజరు కాదని అనేకమంది ఆమెపై అభియోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో నయన్.. స్టార్ హీరోలను కూడా పట్టించుకోదు. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్‌లో నయనతార ఎక్కడ కనపడలేదు. తాజాగా నయన్..తాను ఎందుకు ప్రమోషన్స్‌కు రాననే విషయమై ఒక మీడియాకు ఇంటర్వ్యూలో వివరించి అందరినీ ఆశ్యర్యపరిచింది.

Lady Superstar Nayanthara changer her mindset and opened glamour gates with new photoshoot pk నయనతార ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది..? ఈమె ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు కూడా. తన క్రేజ్ వాడుకుంటూ రోజురోజుకీ మార్కెట్ పెంచుకుంటుంది నయన్. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఉన్నట్లుండి గ్లామర్ బాట పట్టింది నయనతార. Nayanthara,Nayanthara hot,Nayanthara vogue photoshoot,Nayanthara mahesh babu,Nayanthara movies,Nayanthara twitter,Nayanthara hot scenes,Nayanthara video songs,Nayanthara hot songs,telugu cinema,Nayanthara hot kissing scenes,Nayanthara sye raa,నయనతార,నయనతార హాట్,నయనతార గ్లామర్,తెలుగు సినిమా
నయనతార వోగ్ ఫోటోషూట్
ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి తాను నటించిన సినిమాలకు సంబంధించిన ఏ ప్రచార కార్యక్రమంలోనూ తాను పాల్గొనలేదని . . పదేళ్ల తర్వాత తాను మీడియాతో ముచ్చటించానని పేర్కొంది. ఇంకా ఆమె మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా గోప్యత పాటిస్తాను. నేనేం ఆలోచిస్తున్నానో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదనుకుంటాను. జన సమూహాల్లోకి వెళ్లడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. గతంలో నా వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లను ప్రచారం చేశారు. అలాంటి ఒత్తిళ్లను నేను తట్టుకోలేను. అందుకే మీడియాకు దూరంగా ఉంటున్నా. నటించడం నా వృత్తి. నా సినిమాలే నేనేమిటో తెలియచెబుతాయి అని తెలిపింది. ఇటీవల విడుదలైన సైరా చిత్రంలో చిరంజీవి సతీమణి పాత్రలో నయనతార కనిపించిన విషయం తెలిసిందే.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...