Home /News /movies /

NAYANTHARA NEW MOVIE WITH COMEDIAN RJ BALAJI STARTS SR

హాస్య నటుడితో నయనతార కొత్త సినిమా..

నయనతార (Instagram/photo)

నయనతార (Instagram/photo)

ఓ ప్రముఖ హాస్య నటుడితో లేడి సూపర్ స్టార్ నయనతార కొత్త సినిమాను ఒప్పుకుంది. దానికి సంబంధించిన అధికార ప్రకటన కూడ విడుదల చేసింది చిత్రబృందం.

    Nayanthara : నయనతార... తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే..మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం నయన్  తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలో ‘నెట్రికన్’ అనే తమిళచిత్రంలో నటిస్తోంది. నయన్ ఈ సినిమాలో  కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తోంది.


    కాగా నయన్, రేడియో జాకీ నుంచి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌జే బాలాజీతో ఓ సినిమాను చేయడానికి ఒప్పుకుంది. ఆర్‌జే బాలాజీ ఇటీవలే ‘ఎల్‌కేజీ అనే తమిళ చిత్రంలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. నయన్‌తో నటించే ఈ కొత్త సినిమాకు ‘మూకుత్తి అమ్మన్‌’ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఓ అధికార ప్రకటన కూడ విడుదలైంది.

    తమన్నా లేటెస్ట్ హాట్ పిక్స్..
    First published:

    Tags: Nayanathara, Telugu Cinema News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు