ప్రియుడుతో నయనతార తాజా సంచలనం..

నయనతార (Twitter.com/Nayanthara)

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌లు లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

 • Share this:
  Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అది అలా ఉంటే తాజాగా ప్రియుడు విఘ్నేశ్ నిర్మాతగా నయనతార ఓ చిత్రం చేయడానికి సిద్ధం అవుతోందనేది తాజా సమాచారం. కాగా ఈ సంవత్సరం నయన తార నటించిన నాలుగు చిత్రాలు విడుదలైనా.. అందులో మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయాయి. అజిత్‌‌తో  నటించిన 'విశ్వాసం', దానితో పాటు ఆమె హీరోయిన్‌ సెంట్రిక్‌‌గా చేసిన 'ఐరా', 'కొలైయుధీర్‌ కాలం' శివ కార్తికేయన్‌‌తో నటించిన 'మిస్టర్‌ లోకల్' చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఓ 'విశ్వాసం' తప్ప మిగిలిన మూడు చిత్రాలు నయనతారకు నిరాశనే మిగిల్చాయి.


  కాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్‌ సరసన 'దర్బార్‌'తో పాటు, విజయ్‌తో 'బిగిల్', చిరంజీవికి జంటగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాలు చేస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం రిలీజ్ అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. అయితే నయనతారకు నెక్ట్స్‌ ఏ సినిమా చేస్తోందన్న ప్రశ్న తలెత్తేలోపే నయనతార కొత్త చిత్రానికి రెడీ అయ్యి పోయింది. తన నెక్ట్స్ చిత్రాన్ని ఆమె లవర్ విఘ్నేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహించనున్నారు.

   
  Published by:Suresh Rachamalla
  First published: