Nayanthara : నయనతార మూడోకన్ను.. మరో థ్రిల్లర్‌‌తో వస్తోన్న లేడీ సూపర్ స్టార్..

Nayanthara : నయనతార మూడోకన్ను.. మరో థ్రిల్లర్‌‌తో వస్తోన్న లేడీ సూపర్ స్టార్..

నెట్రికన్‌లో నయనతార Photo : Twitter

Nayanthara : లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఇప్పటివరకూ పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించిచగా.. తాజాగా ఓ థ్రిల్లర్‌తో ముందుకొస్తోంది.

  • Share this:
    Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  ఈ నేపథ్యంలోనే  నయన్ తాజాగా తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు 'నెట్రిక్కన్' (మూడో కన్ను). ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి ఓ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ లభిస్తోందని విఘ్నేశ్ శివన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా.  ఈ నెట్రికన్‌ను తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేయనున్నారు.

    అది అలా ఉంటే ‘మూకుత్తి అమ్మన్‌’ అనే మరో సినిమాలో నయనతార నటిస్తోంది.  ఈ సినిమాలో నయన్‌ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతుంది. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో సమ్మర్‌లో విడుదలకావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఇంత వరకూ సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్దపడుతున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావలసివున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ కు నిర్మాత ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు