Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 23, 2019, 5:25 PM IST
విఘ్నేశ్ శివన్, నయనతార Instagram
అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు ఓ కుర్ర దర్శకుడు నయనతారను తన డార్లింగ్ అనేసాడు. అందులోనూ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆ దర్శకుడు అంత మాట అనేయడంతో నిజంగానే అక్కడున్న వాళ్లంతా పరేషాన్ అయ్యారు. నయనతార అంటే కేరాఫ్ తమిళ్ సినిమా ఒక్కటే కాదు.. సౌత్ సినిమా. అన్ని ఇండస్ట్రీలలో వరస సినిమాలు చేస్తూ సంచలనాలు రేపుతుంది నయన్. ఇప్పటికీ తగ్గని క్రేజ్‌తో సినిమాకు కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటూ దూసుకెళ్లిపోతుంది.

అట్లీ కుమార్ నయనతార
ఈమె ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నయనతార కేరాఫ్ విఘ్నేష్ శివన్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన సత్యం. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అట్లీ కుమార్ మాత్రం నయనతార నా డార్లింగ్ అంటూ చెప్పేసాడు. అందులో మరో అర్థం ఏం లేదు కానీ మనోడు ఆమెతో ఉన్న స్నేహాన్ని అలా చెప్పేసరికి అంతా షాక్ అయిపోయారు. అట్లీ తొలి సినిమా రాజా రాణిలో నయనతారే హీరోయిన్.

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార
ఆర్య, జై హీరోలైనా కూడా నయన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాతోనే అట్లీ సంచలనాలకు తెరతీసాడు. ఆ తర్వాత తెరీ, మెర్సల్ సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు బిగిల్ సినిమాతో వస్తున్నాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. తెలుగు ప్రెస్ మీట్లో నయన్ గురించి మాట్లాడుతూ తను నా డార్లింగ్ అనేసాడు అట్లీ. ఆమె లేకపోతే రాజా రాణి సినిమా లేదంటూ చెప్పేసాడు. మొత్తానికి నయన్ నా డార్లింగ్ అంటూ అట్లీ చెప్పడం మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 23, 2019, 5:24 PM IST