నయనతార అంటే క్రష్ అంటున్న యంగ్ రెబల్ ప్రభాస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నయనతారపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

news18-telugu
Updated: August 28, 2019, 11:32 AM IST
నయనతార అంటే క్రష్ అంటున్న యంగ్ రెబల్ ప్రభాస్..
నయనతార, ప్రభాస్
  • Share this:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలితో అం‍తర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ రేంజ్‌ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కటం ఖాయంగా కనిపిస్తోంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన సాహో అంతర్జాతీయ స్థాయి ప్రమాణలతో తెరకెక్కించారు. బాహుబలితో జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్ సాధించిన ప్రభాస్‌ ఈ సినిమాతో నేషనల్‌ ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా హాలీవుడ్‌ స్థాయి కాన్సెప్ట్‌తో పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యూనిట్ సభ్యులు.తెలుగుతో తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సాహో విడుదల కానున్న సందర్బంగా ముంబై, తమిళనాడు తదితర ప్రదేశాల్లో ప్రభాస్ పర్యటించారు.

‘యోగి’ మూవీలో ప్రభాస్ సరసన నయనతార (File Photo)


అయితే 'సాహో' తమిళ వెర్షన్ ప్రమోషన్ లో భాగంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది.ప్రస్తుతం ఉన్న తమిళ హీరోయిన్స్ లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై ప్రభాస్ స్పందించారు. తనను నయనతార అంటే ఇష్టమని, వెండితెరపై ఆమె కనిపించే తీరు, కనబర్చే అభినయం తనకు బాగా నచ్చుతాయని పేర్కొన్నారు ప్రభాస్. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'యోగి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 28, 2019, 11:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading