నయనతార చేసిన పనికి అవాక్కవుతున్న నిర్మాతలు..

దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార రీసెంట్‌గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ భామ..

news18-telugu
Updated: November 21, 2019, 1:09 PM IST
నయనతార చేసిన పనికి అవాక్కవుతున్న నిర్మాతలు..
నయనతార (Instagram/photo)
  • Share this:
దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార రీసెంట్‌గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే కదా.  ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ లో కూడా కథానాయికగా మెరిసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ భామ రజినీకాంత్ సరసన నటించిన ‘దర్బార్’ సినిమా త్వరలో విడుదల కానుంది. సౌత్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న కథానాయికగా అలరిస్తోన్న నయనతార ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు తీసుకుంటోంది. హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్‌తో చాలా మంది ఆమె ముందు క్యూ కడుతున్నారు. ఇలా తమ సినిమాల్లో యాక్ట్ చేయమని అడిగిన వాళ్లకు నయనతార కళ్లు బయర్లు కమ్మేలా  రెమ్యునరేషన్ చెబుతుందని కోలీవుడ్ నిర్మాతలు అంటున్నారు. తాజాగా ఒక ప్రొడ్యూసర్..  నయనతారను కలిస్తే..రూ.8 కోట్లు ఇస్తేనే యాక్ట్ చేస్తా అని చెబుతోంది. ప్రస్తుతం నయనతార .. విఘ్నేష్ శివన్ నిరమాతగా ‘నెట్రికన్’ సినిమాతో పాటు ఆర్.బాలాజీ దర్శకత్వలో భక్తిరసాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కోసం నయనతార పూర్తి నిష్ఠగా శాఖాహారిగా మారినట్టు చెబుతున్నారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు