news18-telugu
Updated: October 18, 2019, 10:55 AM IST
నయనతార (twitter/photo)
నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తూ లేడి సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న అందాల తార. ఆమె తెలుగులో చాలా కాలం తర్వాత చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో ఓ కథానాయికగా నటించింది. నయనతార మామూలుగా ఎవరి మీదా కోపం తెచ్చుకోదు. అంతదాకా ఎందుకు తనతో పనిచేసే హీరోలను, తోటి ఆర్టిస్టుల గురించి అంతగా పట్టించుకోదు, ఆలోచించదు. తన పనేదో తాను అన్నట్టుగా ఉంటుంది అయితే ఒక విషయంలో నయనతార హర్ట్ అయిందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించిన సైరా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైరాకి భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తే... నరసింహారెడ్డి ప్రేమికురాలి పాత్రలో తమన్నా నటించింది. అయితే 'సైరా’ ఫలితం ఎలా ఉన్నా, అందులో నయనతార కన్నా తమన్నా పాత్రే ఎక్కువ సేపు ఉండడం ఇప్పుడు నయనతారకు ఆగ్రహం కలిగిస్తోందట.
ఈ చిత్రం లో తమన్నాది చిన్న రోల్ అని ముందు నుంచి అందరు అనుకున్నారు. అయినప్పటికి తమన్నా 'సైరా' ప్రమోషన్స్ లో తనని తాను బాగా హైలెట్ చేసుకోవడానికే పాల్గొంటుందని కూడా అన్నారు. కారణం తమన్నాకి ఇప్పుడు సరైన అవకాశాలు లేకపోవడమే. ఇక నయనతారని బ్రతిమాలినా కూడా సైరా ప్రమోషన్స్‌కి రాలేదని, మెగాస్టార్ అయితే మాత్రం ఏంటి.. నాకు ఏ సినిమా అయినా ఏ హీరో అయినా ఒకటే అన్నట్టుగా నయనతార వ్యవహరిచిందని ప్రచారం జరిగింది. అయితే సైరా సినిమా విడుదలయ్యాక సినిమాలో నయన్ పాత్ర కన్నా తమన్నా పోషించిన లక్ష్మి పాత్ర హైలెట్ అవడమే కాదు.. నయన్ కన్నా ఎక్కువగా తమన్నా పాత్రకి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం వలనే నయనతార సైరా ప్రమోషన్స్‌కి రాలేదనే ప్రచారం జరుగుతుంది. తమన్నాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి.. మెయిన్ హీరోయిన్ అయిన తనని లైట్ తీసుకోవడంపై నయన్ ఆగ్రహంగా ఉండడంతోనే ప్రమోషన్ రేక్వెస్ట్‌ను కాదందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలాడుకుంటున్నారు.
Published by:
Suresh Rachamalla
First published:
October 18, 2019, 10:55 AM IST