‘సైరా’ విషయంలో రామ్ చరణ్‌ తీరును కడిగి పారేసిన నయనతార..

చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మించాడు. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర తగ్గింపుపై నయనతార రామ్ చరణ్ పై ఫైర్ అయినట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 2:05 PM IST
‘సైరా’ విషయంలో రామ్ చరణ్‌ తీరును కడిగి పారేసిన నయనతార..
రామ్ చరణ్ నయనతార
  • Share this:
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మించాడు. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్దమ్మ పాత్రలో నయనతార యాక్ట్ చేసింది. మరోవైపు నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మీ పాత్రలో తమన్నా నటించింది. ఈ సినిమాలో నయనతార పాత్ర కన్న లక్ష్మీ పాత్ర చేసిన తమన్నాకే ఎక్కువ స్కోప్ ఉండటంపై నయనతార.. రామ్ చరణ్ పై మండిపడ్డట్టు సమాచారం. నిజానికి ‘సైరా’లో నటించడానికి నయనతారా మొదట్లో ఒప్పుకోలేదు. కానీ రామ్ చరణ్ మాత్రం సైరాలో తమన్నా పాత్ర కంటే నయనతార క్యారెక్టర్‌కే ఎక్కవ స్కోప్ ఉందని చెప్పి ఈ పాత్ర చేయడానికి నయనతారను ఒప్పించినట్టు సమాచారం.

Megastar Chiranjeevi fans targeted Nayanthara and they disappointed with the nature of lady superstar pk అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుందని తెలుస్తుంది. నిజంగానే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు నయనతారపై మండిపడుతున్నారు. ఆమె తీరు చూసి అహసనం వ్యక్తం చేస్తున్నారు. chiranjeevi,nayanthara,nayanthara twitter,nayanthara instagram,nayanthara hot,nayanthara hot images,nayanthara sye raa movie,nayanthara sye raa movie promotion,nayanthara chiranjeevi,telugu cinema,sye raa pre release,nayanthara Ram charan,nayanthara promotion,నయనతార,నయనతార చిరంజీవి,చిరంజీవి సైరా ప్రమోషన్స్,నయనతార ప్రమోషన్స్,తెలుగు సినిమా
‘సైరా నరసింహారెడ్డి’ (twitter/Photo)


ఇక దాంతో పాటు అప్పటి వరకు నయనతారకు ఎవరు ఇవ్వని అత్యధిక పారితోషకం కూడా ఇచ్చాడు రామ్ చరణ్. ఇక సైరాకు సైన్ చేసే ముందే నయనతార ఈ సినిమా ప్రమోషన్‌ చేయనని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. ‘సైరా’ సినిమా విడుదలయ్యాక ఎడిటింగ్‌లో నయనతార పాత్రను చాలా కుదించేసారు. మరోవైపు తమన్నాకు పాత్రకు ప్రశంసలు లభించడంతో నయనతార తీవ్ర అసహనానికి గురైనట్టు సమాచారం. అంతేకాదు సైరాలో తన పాత్రను ఎందుకు తగ్గించి వేసారు అంటూ నయన్ తార.. రామ్ చరణ్ తీరుపై  కాస్తంత అసహనం వ్యక్తం చేసినంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది.  అంతేకాదు తాను సైరా ప్రమోషన్‌కు రాని చెప్పినా.. తాను ప్రమోషన్‌ను ఎగ్గొట్టినట్టు తనపై దుష్ప్రచారం చేసారని నయనతార తన దు:ఖాన్ని వెళ్లగక్కింది. మొత్తానికి  ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ.. నయనతార ఆవేదనలో ఎంతో కొంత నిజం ఉందనేది వాస్తవం.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 19, 2019, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading