Nayanthara : నయనతారకు నాని కష్టాలు.. తప్పిని పరిస్థితిలో అలా చేయాల్సివస్తోందట..

నయనతార Photo : Twitter

Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది.

  • Share this:
    Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బాపు చిత్రం, బాలయ్య సరసన 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అనేలా యాక్ట్ చేసిందీ బ్యూటీ. అలాంటీ సినిమా ఒకటి ‘మూకుత్తి అమ్మన్‌’. ఈ సినిమాలో నయన్‌ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతుంది. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో సమ్మర్‌లో విడుదలకావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఇంత వరకూ సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్దపడుతున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.

    Nayanthara news,Nayanthara films,Nayanthara boyfriend,Nayanthara Mookuthi Amman,Nayanthara Mookuthi Amman first look,నయనతార,నయనతార సినిమాలు,నయనతార వార్తలు,మూకుత్తి అమ్మన్‌,మూకుత్తి అమ్మన్‌ లుక్
    అమ్మవారిగా నయనతార Photo : Twitter


    ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావలసివున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ కు నిర్మాత ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఇక ఇదే బాటలో తెలుగులో చాలా సినిమాలు రానున్నాయి. నాని, సుధీర్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న వి, అనుష్క నిశ్శబ్దం విడుదలకానున్నాయి. సూర్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆకాశం నీ హద్దురా కూడా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: