news18-telugu
Updated: January 16, 2020, 5:09 PM IST
నయనతార (twitter/photo)
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా, దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలకు పెద్ద దిక్కుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంక్రాంతి సీజన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దర్బార్’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ మూవీలో రజనీకాంత్ జోడిగా నయనతార నటించింది. అయితే లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల దర్బార్ సినిమాలో మరోసారి మురుగదాస్ డైరెక్షన్లో నటించింది నయనతార. గతంలో డైరెక్టర్ మురుగదాస్, టాప్ హీరో సూర్య కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'గజిని'లో నటించటం తన కెరీర్లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం అంటూ నయనతార కామెంట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనే అయింది. తాజాగా ఇపుడు ‘దర్బార్’ సినిమా తరవాత కూడా నయనతార నుంచి ఇలాంటి విమర్శలే రావడం ప్రస్తుతం కోలివుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. వివరాలలోకి వెళితే.. దర్బార్ చిత్రంలో నయనతారకు అన్యాయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు కూతురుగా నటించిన నివేదా థామస్‌కు ఉన్న ప్రాముఖ్యతను కూడా నయనతారకు ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నయనతార
నయనతారను ఈ చిత్రంలో ఆమె స్థాయికి తగ్గట్టుగా చూపించలేదని ఆమె అభిమానులు అంటున్నారు. నయనతార అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు ఒప్పుకోవాలనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. నిజానికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌తో నయనతారకు చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతూనే వుంది కనుక ఇలాంటి వార్తలు రావడం సహజమే అంటున్నారు కొంతమంది విమర్శకులు. ఏదేమైనా కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ మ్యాటర్ టాపిక్ హాట్ గా మారింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 16, 2020, 5:09 PM IST