ప్రియుడిని కూడా వదిలిపెట్టని నయనతార... ఆ విషయంలో అంతే మరి..

 Nayanthara : నయనతార.. ఇప్పుడో సూపర్ స్టార్. అటు తమిళ సినిమాలు చేస్తూనే.. ఇటు తెలుగు, మలయాళ సినిమాల్లో గ్లామర్ రోల్స్‌లో అదరగొడుతూ... లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా మెరుస్తోంది.

news18-telugu
Updated: October 3, 2019, 7:15 AM IST
ప్రియుడిని కూడా వదిలిపెట్టని నయనతార... ఆ విషయంలో అంతే మరి..
Instagram
  • Share this:
Nayanthara : నయనతార.. ఇప్పుడో సూపర్ స్టార్. అటు తమిళ సినిమాలు చేస్తూనే.. ఇటు తెలుగు, మలయాళ సినిమాల్లోను అదరగొడుతోంది. నయన్ వెంకటేష్ 'లక్ష్మీ' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరో వైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.. ఈ లేడి సూపర్ స్టార్. అందులో భాగంగా.. నయనతార 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. మరి దానికి తగ్గట్లు తన రెమ్యూనరేషన్ కూడా ఉండాలి కదా.. అందులో భాగంగా నయనతార తన ఇమేజ్‌కు, మార్కెట్‌కు తగ్గట్లుగానే..  పారితోషికం డిమాండ్ చేస్తోందని తమిళ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ తొమ్మిదేళ్లలో తన రెమ్యూనరేషన్ కోటి నుండి రూ.6 కోట్లకు పెరిగిందని కోలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.










View this post on Instagram






A post shared by Nayanthara (@nayantharaofficiial) on





నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలోని ‘నెట్రికన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి కూడా దాదాపు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నయన్ ఈ సినిమాలో  కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ‘నెట్రికన్’‌ను  మిలింద్‌రావ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు.  ఆ మధ్య వచ్చిన ‘నానుం రౌడీదాన్‌’ చిత్రంలో నయనతార వినికిడి లోపమున్న అమ్మాయిగా అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌ సరసన 'దర్బార్‌'తో పాటు, విజయ్‌తో 'బిగిల్' చేస్తోంది. కాగా నయన్ చిరంజీవికి జంటగా 'సైరా నరసింహారెడ్డి' సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.
Published by: Suresh Rachamalla
First published: October 3, 2019, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading