Nayanthara | Connect : నయనతార (Nayanthara) ఈ మధ్యకాలంలో ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే.. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈమె నటించిన సినిమా ‘కనెక్ట్’ (Connect). ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన "గేమ్ ఓవర్" కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి దాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ డిసెంబర్ 09న ట్రైలర్‌ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ఏ మేరకు ఆకట్టుకోనుందో చూడాలి.
Get ready to be scared ????#Nayanthara's Spooky tale #Connect Telugu trailer releasing 9th December Mid Night 12AM !!!#ConnectfromDec22 ????@AnupamPKher #Sathyaraj #VinayRai Directed by @Ashwin_saravana Produced by @Rowdy_Pictures @VigneshShivN @UV_Creations pic.twitter.com/XRILe6gXv4
— UV Creations (@UV_Creations) December 6, 2022
ఇక నయనతార ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె రీసెంట్గా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీతో పలకరించింది. ఈ చిత్రంలో ఈమె చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. అంతకు ముందు ఈమె చిరు.. సరసన ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా నటించిన సంగతి తెలిసిందే. నయన్ ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కేక పెట్టిస్తోంది. ఇప్పటి వరకు మలయాళం, తెలుగు, తమిళ,కన్నడ, చిత్రాల్లో నటించిన ఈమె సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ఈమె హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జవాన్’ చిత్రంతో హిందీలో అడుగు పెట్టబోతుంది. మరి దక్షిణాదిలో సత్తా చాటిన నయనతార .. ఇపుడు హీరోయిన్గా బీ టౌన్లో సత్తా చాటుతుందా అనేది చూడాలి.
ఇక ఆమె లేటెస్ట్ థ్రిల్లర్ కనెక్ట్ విషయానికి వస్తే.. ఈ ‘కనెక్ట్’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో హిందీ నటుడు అనుపమ్ ఖేర్‌తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం - పృథ్వి చంద్రశేఖర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ - మణికంఠన్ కృష్ణమాచారి, ఎడిటింగ్ - రిచర్డ్ కెవిన్, పీఆర్వో - జీఎస్కే మీడియా అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nayanthara, Tollywood news