నయనతారకు షాక్.. ప్రమాదంలో కెరీర్..?

Nayanthara : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) కెరీర్ ప్రమాదంలో పడబోతోందా? ఆమెకు నిర్మాతల సంఘం భారీ షాక్ ఇవ్వబోతోందా? అంటే అవునంటున్నాయి సినీ వర్గాలు.

news18-telugu
Updated: February 21, 2020, 10:00 AM IST
నయనతారకు షాక్.. ప్రమాదంలో కెరీర్..?
నయనతార (Nayanthara)
  • Share this:
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) కెరీర్ ప్రమాదంలో పడబోతోందా? ఆమెకు నిర్మాతల సంఘం భారీ షాక్ ఇవ్వబోతోందా? అంటే అవునంటున్నాయి సినీ వర్గాలు. గ్లామర్ పాత్రల నుంచి కీలక పాత్రలు పోషించే స్థాయికి ఎదిగిన ఈ హాట్ బ్యూటీ.. దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె దాదాపు ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల వరకు తీసుకుంటోందని ప్రచారం కూడా సాగుతోంది. అయితే, ఆ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సై అంటున్నా.. ఆమె పెట్టించే ఎక్స్‌ట్రా ఖర్చులపైనే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నయనతార కోసం ప్రత్యేక క్యారవాన్, పర్సనల్ అసిస్టెంట్, బాడీగార్డులు, వాళ్లకు జీతాలు, మేకప్‌మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కారు డ్రైవర్ ఇలా.. ఆమెతో ఉండే వాళ్లందరికీ నిర్మాతే జీతాలు ఇస్తున్నారట. నయనతార ఒక రోజు షూటింగ్‌కి వస్తే.. అదనంగా రోజుకు రూ. 60 నుంచి 70 వేల దాకా నిర్మాత జేబుకు చిల్లు పడుతోందట. అదీకాక.. తన ప్రియుడు వచ్చినా ఆ ఖర్చు కూడా నిర్మాతలపైనే పడుతోందట.

దీంతో, నిర్మాతల మండలిలో ఆమె ఖర్చుల గురించి చర్చ సాగుతోందట. ఇంతకుముందు నిర్మాత రాజన్ కూడా నయనతార పారితోషికం గురించి మాట్లాడి చర్చకు తెరలేపారు. పారితోషికం చర్చ రావడంతో నిర్మాతలంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. క్యారవాన్, ఇతర ఖర్చులన్నీ హీరోయిన్ పారితోషికం నుంచే పెట్టుకునే నిబంధన తీసుకురావాలని చూస్తున్నారట. నయనతార కారణంగా ఇతర హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ నుంచే ఖర్చులను భరించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకటి, రెండు సినిమాలు చేతిలో పెట్టుకున్న నయనతార.. తాజా ఆరోపణల వల్ల కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 21, 2020, 10:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading