హీరోలను తలదన్నే స్థాయిలో నయనతార రెమ్యూనరేషన్..

 Nayanthara : నయనతార.. ఇప్పుడో సూపర్ స్టార్. అటు తమిళ సినిమాలు చేస్తూనే.. ఇటు తెలుగు, మలయాళ సినిమాల్లో అదరగొడుతోంది.

news18-telugu
Updated: September 20, 2019, 9:30 AM IST
హీరోలను తలదన్నే స్థాయిలో నయనతార రెమ్యూనరేషన్..
విఘ్నేశ్ శివన్, నయనతార Instagram
news18-telugu
Updated: September 20, 2019, 9:30 AM IST
Nayanthara : నయనతార.. ఇప్పుడో సూపర్ స్టార్. అటు తమిళ సినిమాలు చేస్తూనే.. ఇటు తెలుగు, మలయాళ సినిమాల్లో అదరగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ.. వెంకటేష్ 'లక్ష్మీ' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా.. నయనతార అరం, డోరా, కోలమావు కోకిల, ఐరా, కొలైయుదిర్‌కాలం... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార దానికి తగ్గట్లుగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ తొమ్మిదేళ్లలో తన రెమ్యూనరేషన్ కోటి నుండి రూ.6 కోట్లకు పెరిగిందని కోలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె రజనీకాంత్‌, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దర్బార్‌’కు కూడా ఇంతే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

Loading...
నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలోని ‘నెట్రికన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి కూడా దాదాపు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నయన్ ఈ సినిమాలో  కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ‘నెట్రికన్’‌ను  మిలింద్‌రావ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు.  ఆ మధ్య వచ్చిన ‘నానుం రౌడీదాన్‌’ చిత్రంలో నయనతార వినికిడి లోపమున్న అమ్మాయిగా అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌ సరసన 'దర్బార్‌'తో పాటు, విజయ్‌తో 'బిగిల్', చిరంజీవికి జంటగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాలు చేస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...