ఎంజాయ్ చేస్తున్న నయనతార.. పుట్టిన రోజున ప్రియుడితో..

Nayanthara Birthday : సైరా సినిమాలో నరసింహారెడ్డి భార్యగా మెప్పించిన ఈ బ్యూటీ ఈ రోజు 35వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ పుట్టిన రోజును ఈమె ప్రత్యేకంగా జరుపుకుంటోంది.

news18-telugu
Updated: November 18, 2019, 6:57 AM IST
ఎంజాయ్ చేస్తున్న నయనతార.. పుట్టిన రోజున ప్రియుడితో..
నయనతార, విఘ్నేష్ శివన్
  • Share this:
నయనతార.. దక్షిణాది లేడీ సూపర్ స్టార్. సినిమాలో సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే స్థాయి నటన ఆమెది. చరిత్ర అయినా, పురాణాలు అయినా.. ఒక పాత్ర ఆమెకు ఇస్తే అలవోకగా చేసేయగల నటి. సినిమా ఏదైనా సరే.. ఎంత పెద్ద హీరో ఉన్నా సరే.. ఆమెకు గుర్తింపు కచ్చితంగా వస్తుంది. చంద్రముఖి, గజిని, లక్ష్మి, తులసి,అదుర్స్, బాస్, వల్లభ.. ఇలా ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాపు చిత్రం, బాలయ్య సరసన శ్రీరామరాజ్యంలో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అనేలా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక, సింహ సినిమాలో ఆమె నటన పీక్స్. ఆ సినిమాలో డైలాగ్ డెలివరీ.. రోమాలు నిక్కపొడిచేలా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు నయనతార యాక్టింగ్ ఏ రేంజ్‌లో ఉందో. ఈ మధ్యే సైరా సినిమాలో నరసింహారెడ్డి భార్యగా మెప్పించిన ఈ బ్యూటీ ఈ రోజు 35వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ పుట్టిన రోజును ఈమె ప్రత్యేకంగా జరుపుకుంటోంది.

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి న్యూయార్క్‌ వీధుల్లో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. వీరిద్దరు అక్కడ బోనీ కపూర్, ఆయన చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను కలుసుకున్నారు. నలుగురు కలిసి డిన్నర్ కూడా చేశారు. ఈ ఫోటోను కూడా విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.


కాగా, ఖుషీ కపూర్ న్యూయార్క్‌లోని యాక్టింగ్ స్కూల్‌లో నటనపై శిక్షణ తీసుకుంటోంది. ఆమెకు తోడుగా ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా అక్కడే ఉండి, కూతురి బాగోగులు చూసుకుంటున్నాడు.First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>