news18-telugu
Updated: November 17, 2019, 1:10 PM IST
నయనతార ఫైల్ ఫోటో Twitter
లేడీ సూపర్ స్టార్ నయనతార రేపు పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ ముద్దుగుమ్మ రేపు 35వ వసంతంలోకి అడుగు పెడుతోంది. నయన్ 1984 నవంబర్ 18న జన్మించింది. కాగా పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రియుడు విగ్నేష్ శివన్‌తో కలిసి నయనతార న్యూయార్క్ సిటీ వెళ్లారు. అందులో భాగంగా ఇప్పటికే అమెరికా చేరిన ఈ జంట బర్త్ డే సెలెబ్రేషన్స్ కొరకు షాపింగ్ చేయడమే కాకుండా న్యూయార్క్ వీధులలో తిరుగుతూ హల్ చల్ చేస్తున్నారు. అది అలా ఉంటే.. ఇక ఈ ఏడాది నయనతార రెండు భారీ చిత్రాలలో నటించారు. వాటిలో ఒకటి తెలుగులో మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి కాగా మరొకటి విజయ్ హీరోగా వచ్చిన విజిల్. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో వచ్చి బక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ఆమె నటించిన మరో చిత్రం దర్భార్. ఈ సినిమాలో రజినికాంత్ సరసన నయనతార నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
Pics : ఇలియానా అదిరిపోయే అందాలు..
Published by:
Suresh Rachamalla
First published:
November 17, 2019, 1:02 PM IST