Home /News /movies /

Vignesh Shivan: నయనతార ప్రియుడు విఘ్నేష్ శివ‌న్‌లో చాలా కళలే ఉన్నాయే.. వీడియో వైర‌ల్

Vignesh Shivan: నయనతార ప్రియుడు విఘ్నేష్ శివ‌న్‌లో చాలా కళలే ఉన్నాయే.. వీడియో వైర‌ల్

నయనతార విఘ్నేష్ శివన్

నయనతార విఘ్నేష్ శివన్

విఘ్నేష్‌ శివన్ తాజాగా త‌న‌లోని మ‌రో టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టాడు. గిటారును వాయిస్తూ ఓ వీడియోను విఘ్నేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో అంత‌కుముందు నేను డ్ర‌మ్స్ వాయించేవాడిని, ఇప్పుడు గిటార్ నేర్చుకొని అంద‌రినీ డిస్ట‌ర్బ్ చేయాల‌నుకుంటున్నా అని చెప్పాడు

ఇంకా చదవండి ...
    Vignesh Shivan: న‌య‌న‌తార ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నానుమ్ రౌడీ దాన్ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన విఘ్నేష్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ మూవీ స‌మ‌యంలోనే న‌య‌న‌తార‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు ఈ న‌టుడు. ఇలా వీరిద్ద‌రు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. అయితే విఘ్నేష్ శివ‌న్ మంచి ద‌ర్శ‌కుడే కాదు ఆయ‌న‌లో ఇంకా చాలా క‌ళ‌లే ఉన్నాయి. ద‌ర్శ‌కుడిగా అవ్వ‌కముందే న‌టుడిగా మూడు చిత్రాల్లో న‌టించారు శివ‌న్. అంతేకాదు ఎన్నో సినిమాల్లో పాటలు కూడా రాశారు. ముఖ్యంగా తాను తెర‌కెక్కించిన సినిమాల్లోని దాదాపుగా పాట‌ల‌న్నీ ఆయ‌నే రాసుకుంటారు. ఇన్ని క‌ళ‌లు ఉన్న విఘ్నేష్‌.. తాజాగా త‌న‌లోని మ‌రో టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టాడు. గిటారును వాయిస్తూ ఓ వీడియోను విఘ్నేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

    ఆ వీడియోలో అంత‌కుముందు నేను డ్ర‌మ్స్ వాయించేవాడిని, ఇప్పుడు గిటార్ నేర్చుకొని అంద‌రినీ డిస్ట‌ర్బ్ చేయాల‌నుకుంటున్నా అని చెప్పాడు. ఇక ఈ పోస్ట్‌కు ఏదైనా ఒక ఇన్‌స్ట్రూమెంట్‌ని నేర్చుకోని, ఎక్స్‌ప‌రిమెంట్ చేయ‌డం నన్ను నాకు మ‌రింత ద‌గ్గ‌ర చేస్తుంటుంది. మారా సినిమా మ‌న‌ల్ని చిన్న ఆనందాల‌తో ప్రేమ‌లో ప‌డేలా చేస్తుంది.



    మాధ‌వ‌న్ మ‌మ్మ‌ల్ని మ‌ళ్లీ అలైపాయుదే రోజుల‌కు తీసుకెళ్లారు. అస‌లు ఆయ‌న‌కు వ‌య‌స్సు తెలుస్తుందా.. మీరు ఫాబ్యుల‌స్ స‌ర్. శ్ర‌ద్దా శ్రీనాత్ నువ్వు చాలా మంచి ఫ‌ర్మామెన్స్ ఇచ్చారు. దినేష్ క్రిష్ణ‌న్ సినిమాటోగ్రఫీ బావుంది. గిబ్రాన్ మ్యూజిక్ సూప‌ర్‌. దిలీప్ కుమార్ వెల్‌డ‌న్ అని కామెంట్ పెట్టారు.

    కాగా ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్.. విజ‌య్ సేతుప‌తితో కాటువాకుల రెండు కాద‌ల్ అనే మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో న‌య‌న‌తార‌, స‌మంత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారు.
    Published by:Manjula S
    First published:

    Tags: Nayanthara, Vignesh Shivan

    తదుపరి వార్తలు