నయనతార ఉందంటే సినిమా హిట్.. ఇక్కడ మరో అనుమానం అవసరం లేదు. అందుకే ప్రేక్షకులు కూడా ఇప్పుడు నయన్ సినిమా అంటే ఎలా ఉంది అని అడగడం మానేసారు. ఆమె ఓకే చేసిందా అయితే హిట్టేలే అంటున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నయనతార కూడా వరస హిట్లతో జోరుమీదుంది. దానికితోడు అవార్డుల పరంగానూ నయనతార దూకుడు మామూలుగా లేదు.

నయనతార
ఆమె సినిమా చేసిందంటే ఆ ఏడాది అన్ని అవార్డులు ఆమె కోసమే పరుగులు తీస్తున్నాయి. రెండేళ్ల కింద దక్షిణాదిన ఉన్న అవార్డులన్నీ "నానుం రౌడీధానుం" కోసం క్యూ కట్టాయి. ఇక 2017కి గానూ అన్ని అవార్డులు "ఆరమ్" సినిమాకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్.. వికటన్.. బిహైండ్‌వుడ్స్.. విజయ్ అవార్డ్స్ అందుకుంది. ఇప్పుడు ఉత్తమనటిగా సైమాలో కూడా ఇమె అవార్డును సొంతం చేసుకుంది.

నయనతార
దుబాయ్ లో జరిగిన ఈ ఈవెంట్లో తళుక్కున మెరిసింది నయనతార. గోపీనైనర్ తెరకెక్కించిన "ఆరమ్"లో కలెక్టర్‌గా నటించింది నయన్. బోరుబావిలో పడిపోయిన చిన్నపిల్ల కోసం జరిగే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. ఇందులో భాగంగా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది ఈ భామ. ఇందులో నయన నటనకు కన్నీరు పెట్టక మానరు ప్రేక్షకులు. ఇక ఈ ఏడాది కూడా ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యే విడుదలైన "ఇమైక్క నోడిగల్" సినిమాతో మరో హిట్ కొట్టింది ఈ బ్యూటీ.

నయనతార ట్విట్టర్ ఫోటోస్
రెండు వారాల్లో రెండు విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది నయన్. ఈమె నటించిన "ఇమైక్క నోడిగల్" ఆగస్ట్ 30న విడుదలైంది. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ చిత్రంలో అథర్వ మురళి, రాశీఖన్నాతో పాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా నటించారు.

నయనతార
ఆగస్ట్ 17న "కోకో" సినిమా కూడా హిట్టైంది. ఒకే భాషలో రెండు వారాల్లో రెండు విజయాలతో తాను ఎందుకు నెంబర్ వన్ హీరోయిన్ అని మరోసారి నిరూపించుకుంది నయన్. ఈ దూకుడు ఇలా ఉండగానే ఇప్పుడు సైమా అవార్డు కూడా నయనతారకే రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం అజిత్‌తో "విశ్వాసం".. తెలుగులో చిరంజీవితో "సైరా" సినిమాల్లో నటిస్తుంది నయనతార.
Published by:Praveen Kumar Vadla
First published:September 15, 2018, 17:43 IST