నయనతారకు (Nayanthara) కవల పిల్లలు అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే కావాలా పిల్లలకు తల్లయింది లేడీ సూపర్ స్టార్ నయనతార. తాము తల్లిదండ్రులం అయ్యామని, తమకు కవల పిల్లలు అంటూ సర్‌ప్రైజింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చి జనాన్ని పరేషాన్ చేశారు నయనతార భర్త విగ్నేష్ శివన్ (Vignesh Shivan). పెళ్ళైన నాలుగు నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కావడం అనేది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
నయనతార పెళ్లి జరిగిన నాలుగు నెలల్లోనే ఇది ఎలా సాధ్యమైంది అనే సంగతి అటుంచితే.. ఈ విషయమై అనూహ్యంగా ఎన్టీఆర్ (Jr Ntr) పేరు ట్రెండ్ అవుతోంది. నయనతారకు కవల పిల్లలు పుడతారని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పడం.. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. నయనతార ఎడమ నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని, అందుకే ఆమెకు కవల పిల్లలు పుడతారని ముందే గెస్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇది రియల్ లైఫ్ వీడియో మాత్రం కాదు. ‘అదుర్స్’ సినిమాలో ఓ సన్నివేశంలో భాగంగా నయన్ తో ఎన్టీఆర్ ఇలా చెప్పారు. ఇప్పుడు నిజంగానే నయన్‌కి కవల పిల్లలు అని అధికారిక సమాచారం బయటకు రావడంతో.. ఆ సన్నివేశాన్ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతారకు కవల పిల్లలు పుడతారని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా ఈ ట్విస్ట్ మాత్రం భలే ఉందిగా అనేవాళ్ళు చాలామందే ఉన్నారు.
#NTR eppudo cheppadu ???? #Nayanthara #NayantharaVigneshShivan pic.twitter.com/rcmnOdNdCn
— CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) October 9, 2022
కాగా.. తమకు కవల మగ పిల్లలని చెప్పిన విగ్నేష్ శివన్.. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో ఇద్దరు పిల్లలు మా లైఫ్ లోకి వచ్చారు. మా కోసం మీ అందరి ఆశీస్సులు కూడా కోరుకుంటున్నా అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. ఈ మేరకు ఆ కవలల పాదాలను నయన్ ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోలను షేర్ చేశారు. దీంతో నయన్- విగ్నేష్ పిల్లల టాపిక్ పలు అనుమానాలకు తెరలేపింది. సరోగసీ విధానం ద్వారా వీళ్ళు తల్లిదండ్రులు అయ్యారని తెలుస్తుండటంపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు.
నయన్ విఘ్నేశ్ లవ్ స్టోరీ, పెళ్లి రూమర్ల మీద లెక్కలేనన్ని రూమర్లు రాగా.. ఎట్టకేలకు వాళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. జూన్ 9న వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్‌గా జరిగింది. ఇంతలోనే ఇప్పుడు వీరికి కవల పిల్లలు అని తెలియడం ఆశ్చర్యకరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Nayanatara, Nayanatara vignesh