Nayanthara : నయనతార... ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌కు పేరుతెచ్చుకుంది. నయన్ తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నయన్ ప్రస్తుతం తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు 'నెట్రిక్కన్' (మూడో కన్ను). ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించనుంది. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. ఈ నెట్రికన్ను తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేయనున్నారు.
నయనతార ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న తమిళ సినిమా “అన్నాత్తే” సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే రజనీకాంత్ ఏజ్ రిత్యా ఈ సినిమాలో నటించే వారు తప్ప.. సినిమా యూనిట్ కి సంబంధం లేని వారితో కలవకూడదు. నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాడు. ఆయన విజయ్ సేతుపతి, సమంత జంటగా వస్తోన్న ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. ఐతే, రజినీకాంత్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు, ఆ సినిమా టీం, ఈ సినిమా టీం కలవకూడదట. దాంతో నయనతార తన బాయ్ ఫ్రెండ్ ని కలవలేని పరిస్థితి. అందులో భాగంగా ఈ ఇద్దరికి వేర్వేరు రూములు ఇచ్చారట. దీంతో ఈ ఇద్దరూ కలవకుండా ఉంటూ.. దూరంగానే ఉంటూ హాయ్ బాయ్‌లు చెప్పుకుంటున్నారట. ఈ జంట త్వరలోనే పెళ్లిచేసుకోనున్నట్లు సమాచారం. ఇక నయన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన ‘మూకుత్తి అమ్మన్’ అనే సినిమా ఇటీవల హాట్ స్టార్‌లో విడుదలై పరవాలేదనిపించింది. ఈ సినిమాలో నయన్ అమ్మవారి గెటప్‌లో దర్శనమిచ్చి అదరగొట్టింది. ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లిగా విడుదలైన సంగతి తెలిసిందే.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.