Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: June 4, 2020, 7:16 PM IST
భక్తి పేరుతో దోచుకుంటున్న దొంగ బాబాలపై వ్యంగ్యాస్త్రం ఈ సినిమా. దీవాళికి సినిమా విడుదల కానుందని ఇప్పటికే దర్శక నిర్మాతలు తెలిపారు. తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ మూకుతి అమ్మన్ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులో ఈ సినిమా అమ్మోరు తల్లిగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార వరస సినిమాలతో బిజీగా ఉంది. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలుగా ఖాళీగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఒక్కసారి లాక్డౌన్ కొలిక్కి రాగానే మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈమె అమ్మవారి పాత్రలో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకుడిగా మారి మూకుతి అమ్మన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందులో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఆధ్యాత్మిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార అమ్మవారిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

అమ్మవారి పాత్రలో నయనతార (nayanthara)
తాజాగా నయనతార గెటప్‌కి సంబంధించిన పలు ఫోటోలు విడుదలయ్యాయి. దర్శకుడు ఆర్జే బాలాజీతో కలిసి ఈమె పోజులిచ్చింది. మూకుతి అమ్మన్ పాత్రలో నయన్ లుక్ అదిరిపోయింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక అమ్మవారి పాత్రలో నయనతార కూడా చక్కగా ఒదిగిపోయింది. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా మా నయనతారకు ఏ పాత్ర అయినా ఇట్టే సరిపోతుందబ్బా అంటూ పండగ చేసుకుంటున్నారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
June 4, 2020, 7:16 PM IST