Home /News /movies /

NAYANTHARA AND VIGNESH SHIVAN WEDDING IN MAHABALIPURAM SB

Nayanthara-Vignesh Shivan wedding: ఇవాళ నయనతార విఘ్నేశ్ వివాహం.. హాజరుకానున్నచిరంజీవి,బాలకృష్ణ,సమంత

నయనతార వివాహం

నయనతార వివాహం

నయనతార-విఘ్నేష్​ శివన్​ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్​ ఇండస్ట్రీలో లేడీ సూపర్​స్టార్​గా నయనతార, సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​గా విఘ్నేష్​ శివన్​ గుర్తింపు పొందారు.

    నయనతార,విఘ్నేశ్ శివన్ జంట ఇవాళ పెళ్లి చేసుకోనుంది. తమిళనాడు మహాబలిపురలోని ఓ రిసార్ట్‌లో వీరి వివాహం జరగనుంది. ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్​ శివన్​ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్​ ఇండస్ట్రీలో లేడీ సూపర్​స్టార్​గా నయనతార, సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​గా విఘ్నేష్​ శివన్​ గుర్తింపు పొందారు. వీరిద్దరు ఇవాళ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతోంది. మహాబలిపురంలోని రిసార్ట్​లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

    ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్​లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సమంత, తమిళనాడు సీఎం స్టాలిన వంటి ప్రముఖులు నయనతార పెళ్లికి హాజరుకానున్నట్లు సమాచారం. చిరంజీవితో కలిసి నయనతార సైరా సినిమాలో నటించారు. అటు.. బాలకృష్ణ నయనతార జంటగా జై సింహా  సినిమాలో కలిసి నటించారు. ఇక తాజాగా సమంత, నయనతార కలిసి విజయ్ సేతుపతితో తమిళ్ మూవీలో నటించారు. కతవాకుల రెండు కాదల్ సినిమాలో ఈ భామాలిద్దరు కలిసి నటించారు.



    వీలైనంత వరకు వీరి పెళ్లి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడ్డారు. కానీ సోషల్ మీడియాలో వారి ఫోటోలు ఈజీగా లీక్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. కానీ వాటిన్నంటినీ.. బ్రేక్ చేస్తూ.. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేసింది. మహాబలిపురంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది.  చాలావరకు వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అలాగే అతి దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు గా తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి కండిషన్ మంచి సెలబ్రేషన్స్ లో ఒక భాగమే అని డ్రెస్ కోడ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


    ఇక జూన్ 11న ప్రత్యేక లంచ్ కోసం ఈ కొత్త జంట మీడియాను కలవనున్నారు. అలాగే మరి కొంత మంది స్టార్ సెలబ్రిటీలకు కూడా ప్రత్యేకంగా పార్టీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే మొదట, నయన్ విగ్నేష్ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత పెళ్లి వేదికను మహాబలిపురానికి మార్చారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chiranjeevi, Nayanatara vignesh, Nayanathara, Samantha Ruth Prabhu

    తదుపరి వార్తలు