హోమ్ /వార్తలు /సినిమా /

ప్రియుడితో నయనతార రొమాన్స్... వైరల్‌గా మారిన పిక్..

ప్రియుడితో నయనతార రొమాన్స్... వైరల్‌గా మారిన పిక్..

నయనతార (Twitter/Photo)

నయనతార (Twitter/Photo)

Nayanthara : నయనతార... తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది.

  Nayanthara : నయనతార... తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరో వైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది. అందులో భాగంగా.. నయనతార 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. కాగా నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలోని ‘నెట్రికన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. నయన్ ఈ సినిమాలో  కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తోంది.

  View this post on Instagram

  4 years ❤️ #naanumrowdydhaan


  A post shared by nayanthara🔵 (@nayantharaaa) on  ఈ సినిమా ఓ కొరియన్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఇటీవలే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ‘నెట్రికన్’‌ను  మిలింద్‌రావ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు.  ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌ సరసన 'దర్బార్‌'తో పాటు, విజయ్‌తో 'బిగిల్' చేస్తోంది. తెలుగులో నయన్ చిరంజీవికి జంటగా 'సైరా నరసింహారెడ్డి' సినిమా నటించింది. ఈ ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

  అది అలా ఉంటే నయన్, తన ప్రియుడు విఘ్నేష్ శివన్ జంటగా దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో విఘ్నేష్‌ను చేయిని ప్రేమగా పట్టుకుని నయన్ అలా స్టైలీష్‌గా చూస్తూ.. జీన్స్ టాప్‌లో అదిరిపోయింది. మరో వైపు విఘ్నేష్ కొంత ఎమోషనల్ అవుతూ.. నాన్ రౌడీ దాన్ విడుదలై నాలుగు సంవత్సరాలైన సందర్భంగా  ఓ ట్వీట్ చేశాడు. తన ప్రేమకు ఆధ్యం అయిన నాన్ రౌడీ దాన్ సినిమాకు..  ఆ సినిమాలో నటించిన విజయ్ సేతుపతికి, ఇతర నటి నటులకు, నిర్మాతలకు థాంక్స్ చెప్పాడు.

  వోగ్ కవర్ కోసం అందాలు ఒలకబోసిన నయనతార.. లేటెస్ట్ పిక్స్

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Nayanthara, Tamil Film News

  ఉత్తమ కథలు