NAYANTHARA AND VIGNESH SHIVAN MEET CHIEF MINISTER MK STALIN TO INVITE HIM THEIR WEDDING SB
Nayanathara: సీఎంను కలిసిన నయనతార విఘ్నేశ్.. ప్రత్యేకంగా ఆహ్వానం..!
Photo Twitter
నయనతార, విఘ్నేశ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని పంపించారు ఈ జంట. తాజాగా సీఎంను కలిశారు నయనతార, విఘ్నేశ్.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara).. ప్రియుడు విఘ్నేశ్ శివన్’(Vignesh Shivan) ను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. మరో నాలుగు రోజుల్లో ఈ జంట పెళ్లితో ఒక్కటి కానుంది. దీంతో నయనతార పెళ్లి పనులతో ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఆమె స్వయంగా పెళ్లి పనులు చూసుకుంటుంది. పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి , ఆహ్వానపత్రికలు పంపడం వరకు నయనతారనే చూసుకుంటుంది. జూన్ 9న విఘ్నేష్ శివన్ – నయనతార పెళ్లాడనున్నారు. బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి రానున్నారు. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని పంపించారు ఈ జంట.
తాజాగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఈ జంట.. తమ వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికలు పంచడంలో బిజీగా మారారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్..(MK Stalin) ఆయన కుమారుడు హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ను ప్రత్యేకంగా కలిసి తమ పెళ్లికి నయనతార విఘ్నేశ్ ఆహ్వానించారు.నయనతార, విఘ్నేష్ స్వయంగా సీఎం స్టాలిన్‌ను కలిసి తమ పెళ్లి ఆహ్వానపత్రికను అందచేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.
ముందు వీరి పెళ్లి తిరుమలలో జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురం(Mahabalipuram)లోని ఓ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయల ప్రకారం నయన్, విఘ్నేష్ పెళ్లి జరగునుంది. ఇక అదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సినీప్రముఖులు, పొలిటీషియన్స్ మధ్య రిసెప్షన్ ఘనంగా జరుగుందని సమాచారం. ఇప్పటికే రజినీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి(Vijay Sethupati) వంటి ప్రముఖులకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.