హీరోయిన్ నయనతార(Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan) త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు మనకు తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ జంట తమ పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంపడం, పెళ్లి వేడుకలకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. జూన్ 9న ఈ ఇద్దరూ పెళ్లాడనున్నారు. బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే కొందరు అతిథులకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్'ని కూడా ఈ జంట పంపించినట్లు తెలుస్తోంది. ఆ వీడియో ఇన్విటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పత్రిక ప్రకారం నయన-విఘ్నేష్ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. నయనతార పెళ్లి తిరుపతిలో అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాబలిపురం అని ఇన్విటేషన్ స్పష్టం చేస్తోంది. మహబలిపురంలోని ఓ రిసార్ట్‌లో నయనతర విఘ్నేశ్ పెళ్లి వేడుక జరుగనుందట. నయనతార(Nayanthara)పెళ్లి కార్డుపై ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్ చేసిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్ అందరనీ ఆకట్టుకుంటుంది. కార్డు అదిరిందని అభిమానులు, బంధువులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో ఇటీవలే పర్యటించిన నయన్ విఘ్నేశ్ జంట శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ తిరుమలలో పెళ్లి వేదిక కోసం పరిశీలించారని వార్తలు వచ్చాయి. విఐబీ బ్రేక్ దర్శన్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న జంట.. అనంతరం పెళ్లి కోసం.. వేదికను పరిశీలించినట్లు కథనాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. దీంతో వీరిద్దరు పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి.
అయితే నయన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లివరకు వెళ్లి వెనక్కి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార.. తమిళ్ హీరో శింభు మధ్య లవ్ ఎఫైర్ నడిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ప్రభుదేవతో కూడా నయన్ రిలేషన్ షిప్ కొన్నాళ్లు నడిచింది. వీరిద్దరీ మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చివరకు విఘ్నేశ్‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన ఈ లేడీ సూపర్ స్టార్.. ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతోంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.