Nayanthara Ammoru Thalli: ‘అమ్మోరు తల్లి’గా నయనతార విశ్వరూపం.. ‘ఓ మై గాడ్‌’లా అనిపిస్తుందే..

Nayanthara Ammoru Thalli: నయనతార వయసు పెరుగుతుంటే ఇమేజ్ కూడా అలాగే పెరిగిపోతుంది. తను ఎంచుకుంటున్న పాత్రలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా నయన్ సినిమాలో ఉంటే హీరోతో అవసరం లేదనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగించింది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 25, 2020, 9:42 PM IST
Nayanthara Ammoru Thalli: ‘అమ్మోరు తల్లి’గా నయనతార విశ్వరూపం.. ‘ఓ మై గాడ్‌’లా అనిపిస్తుందే..
నయనతార అమ్మోరు తల్లి (nayanthara ammoru thalli)
  • Share this:
నయనతార వయసు పెరుగుతుంటే ఇమేజ్ కూడా అలాగే పెరిగిపోతుంది. తను ఎంచుకుంటున్న పాత్రలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా నయన్ సినిమాలో ఉంటే హీరోతో అవసరం లేదనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగించింది ఈమె. అందుకే గత ఐదేళ్లుగా వరస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది నయనతార. అందులో చాలా వరకు విజయాలు కూడా సాధించాయి. తమిళనాట అంత సక్సెస్ రేట్ హీరోలకు కూడా లేదేమో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కొత్త దర్శకులు నయనతారను దృష్టిలో ఉంచుకుని చాలా కథలు సిద్ధం చేస్తున్నారు. వాటిలో అద్భుతంగా సెట్ అయిపోతుంది నయన్ కూడా. అయితే ఇప్పటి వరకు ఈమె చేసిన పాత్రలు వేరు.. ఇప్పుడు చేసిన పాత్ర వేరు. ఎందుకంటే అమ్మోరు తల్లిగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది నయన్. తమిళనాట కమెడియన్‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌జే బాలాజీ దర్శకుడిగా మారుతున్నాడు. తన స్నేహితుడు శరవణన్‌తో కలిసి నయనతారతో అమ్మోరు తల్లి సినిమా చేస్తున్నాడు బాలాజీ. తమిళనాట ఈ సినిమా మూకూతి అమ్మన్‌గా వస్తుంది. తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో విడుదల చేస్తున్నారు.

నయనతార అమ్మోరు తల్లి (nayanthara ammoru thalli)
నయనతార అమ్మోరు తల్లి (nayanthara ammoru thalli)


ఇదిలా ఉంటే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఇది చూస్తుంటే ఐదేళ్ల కింద వచ్చిన ఓ మై గాడ్ సినిమా గుర్తుకొస్తుంది. మొత్తం అదే అనలేం కానీ అందులో కూడా దేవుడికి, మనిషికి మధ్య పోరాటం జరుగుతుంది.. ఇక్కడ కూడా అంతే. మరీ ముఖ్యంగా దేవుడి పేరు చెప్పి సొమ్ము చేసుకుంటున్న దొంగ బాబాలను బాగానే టార్గెట్ చేసారు అమ్మోరు తల్లి సినిమాలో.

తెలుగు నటుడు అజయ్ ఘోష్ ఇందులో దొంగ బాబాగా నటిస్తున్నాడు. దివాళి కానుకగా హాట్ స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మధ్య సరైన విజయం కోసం చూస్తున్న నయనతార.. అమ్మోరు తల్లితో కచ్చితంగా దుమ్ము దులిపేస్తానంటుంది. మరి ఈమె కోరికను అమ్మోరు తల్లి ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: October 25, 2020, 9:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading