Nayanthara Ammoru Thalli: నయనతార ‘అమ్మోరు తల్లి’ నుంచి వీడియో సాంగ్ విడుదల..

‘అమ్మోరు తల్లి’గా నయనతార (Twitter/Photo)

Nayanthara Ammoru Thalli Video Song: సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా నయనతార తన ఇమేజ్‌ను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అంతేకాదు తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘అమ్మోరు తల్లి’ సినిమాలో ఎల్.ఆర్.ఈశ్వరిగారు పాడిన పాటను రిలీజ్ చేసారు.

 • Share this:
  Nayanthara Ammoru Thalli Video Song: సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా నయనతార తన ఇమేజ్‌ను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అంతేకాదు తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ప్రస్తుతం ఈమె బ్రాండ్ అంబాసిడర్‌లా మరింది. ఈమె ఉంటే వేరే హీరోలు అవసరం లేనంతగా తన ఇమేజ్‌ను పెంచుకుంది. అందుకే గత ఐదారాళ్లుగా వరస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది నయనతార. అందులో చాలా వరకు విజయాలు కూడా సాధించాయి. తమిళనాట అంత సక్సెస్ రేట్ హీరోలకు కూడా లేదేమో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కొత్త దర్శకులు నయనతారను దృష్టిలో ఉంచుకుని చాలా కథలు సిద్ధం చేస్తున్నారు. వాటిలో అద్భుతంగా సెట్ అయిపోతుంది నయన్ కూడా. అయితే ఇప్పటి వరకు ఈమె చేసిన పాత్రలు వేరు.. ఇప్పుడు చేసిన పాత్ర వేరు. ఎందుకంటే అమ్మోరు తల్లిగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది నయన్.  గతంలో బాపు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీరామరాజ్యం’లో సీతగా ఒదిగిపోయిన నయన్.. ఇపుడు అమ్మోరు తల్లిగా తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో అమ్మోరు తల్లి సాంగ్‌ను విడుదల చేసారు. ఈ పాటను ప్రముఖ గాయని ఎల్.ఆర్.ఈశ్వరి ఆలపించడం విశేషం. ఈ పాటను గిరీస్ గోపాలకృష్ణన్ స్వరపరిచారు. ఎ.ఆర్.రహామాన్ సంగీతం అందించారు.  ‘అమ్మెరు తల్లి’ సినిమాను తమిళనాట కమెడియన్‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌జే బాలాజీ డైరెక్ట్ చేసాడు. తన స్నేహితుడు శరవణన్‌తో కలిసి నయనతారతో అమ్మోరు తల్లి సినిమా చేస్తున్నాడు బాలాజీ. తమిళనాట ఈ సినిమా మూకూతి అమ్మన్‌గా వస్తుంది. తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో విడుదల చేస్తున్నారు.ఐదేళ్ల కింద వచ్చిన ఓ మై గాడ్ సినిమా గుర్తుకొస్తుంది. మొత్తం అదే అనలేం కానీ అందులో కూడా దేవుడికి, మనిషికి మధ్య పోరాటం జరుగుతుంది.. ఇక్కడ కూడా అంతే. మరీ ముఖ్యంగా దేవుడి పేరు చెప్పి సొమ్ము చేసుకుంటున్న దొంగ బాబాలను బాగానే టార్గెట్ చేసారు అమ్మోరు తల్లి సినిమాలో. తెలుగు నటుడు అజయ్ ఘోష్ ఇందులో దొంగ బాబాగా నటిస్తున్నాడు. దీపావళి కానుకగా హాట్ స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మధ్య సరైన విజయం కోసం చూస్తున్న నయనతార.. అమ్మోరు తల్లిగా మరోసారి అలరించడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: