ప్రియుడితో నల్లచీరలో మెరిసిన నయన్.. నెటిజన్స్ ఫిదా

ప్రియుడి బర్త్‌డే పార్టీ బ్లాక్ శారీలో మెరిసిన నయనతార

నయన్‌ శివన్ జంట బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ సందర్భంగా ఈ జంట దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Share this:
    అందాల తార నయన్ తన ప్రియుడి బర్త్‌డే వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ అయిన దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ పుట్టినరోజు వేడుకల్ని ఆమె చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. అయితే పార్టీకి అత్యంత సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. నయన్‌ శివన్ జంట బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. తన ప్రియుడి కోసం రెడ్ అండ్ గోల్డ్ కలర్‌లో ఓ స్పెషల్ కేక్‌ను కూడా నయనతార ఆర్డర్ చేసి ప్రత్యేకంగా ఆమె తయారు చేశారు.

    లేడి సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే.‘నేనూ రౌడీనే..’ అన్న సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.  ‘నయన్‌ నా సన్‌షైన్‌’ అంటూ విఘ్నేష్‌ పలుసార్లు ట్విటర్‌లో పోస్ట్‌లు కూడా చేశారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌  సందర్భంగా ఈ జంట దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులంతా ఇద్దరి జంట అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: