నయనతార మళ్లీ కొట్టింద‌బ్బా.. రికార్డు కొట్టిన లేడీ సూప‌ర్ స్టార్..!

రెండు వారాల కింద ఆగ‌స్ట్ 17న "కోకో" సినిమాతో అక్క‌డ సూప‌ర్ హిట్ అందుకున్న ఈ భామ‌.. అంత‌లోనే మ‌రో భారీ హిట్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన "ఇమైక్క నోడిగ‌ల్"కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోతున్నారు. న‌య‌న‌తార కుమ్మేసింద‌బ్బా అంటూ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

news18-telugu
Updated: August 31, 2018, 5:48 PM IST
నయనతార మళ్లీ కొట్టింద‌బ్బా.. రికార్డు కొట్టిన లేడీ సూప‌ర్ స్టార్..!
నయనతార ట్విట్టర్ ఫోటోస్
  • Share this:
న‌య‌న‌తార ఉందంటే సినిమా హిట్.. ఇక్క‌డ మ‌రో అనుమానం అవ‌స‌రం లేదు. అందుకే ప్రేక్ష‌కులు కూడా ఇప్పుడు న‌య‌న్ సినిమా అంటే ఎలా ఉంది అని అడ‌గడం మానేసారు. ఆమె ఓకే చేసిందా అయితే హిట్టేలే అంటున్నారు. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ న‌య‌న‌తార కూడా వ‌ర‌స హిట్ల‌తో జోరుమీదుంది. ఆమె అదృష్టం ఏ స్థాయిలో ఉందంటే.. ఏడాదిగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న సినిమా విడుద‌లైనా కూడా హిట్ అయ్యేంత‌గా. "ఇమైక్క నోడిగ‌ల్" సినిమాతో మ‌రో హిట్ కొట్టింది ఈ బ్యూటీ.

imaikkaa Nodigal
ఇమైక్క నోడిగల్ ట్విట్టర్ ఫోటో


రెండు వారాల్లో రెండు విజ‌యాల‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది న‌య‌న్. ఈమె న‌టించిన "ఇమైక్క నోడిగ‌ల్" ఆగ‌స్ట్ 30న విడుద‌లైంది. అజ‌య్ జ్ఞాన‌ముత్తు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అథ‌ర్వ ముర‌ళి, రాశీఖ‌న్నాతో పాటు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ కూడా న‌టించారు. ఇందులో విల‌న్ ఆయ‌నే. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన "ఇమైక్క నోడిగ‌ల్"కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోతున్నారు. మ‌రోసారి న‌య‌న‌తార కుమ్మేసింద‌బ్బా అంటూ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు.

koko news 18
కోకో కోకిల ట్విట్టర్ ఫోటో


రెండు వారాల కింద ఆగ‌స్ట్ 17న "కోకో" సినిమాతో అక్క‌డ సూప‌ర్ హిట్ అందుకున్న ఈ భామ‌.. అంత‌లోనే మ‌రో భారీ హిట్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా రాశీఖ‌న్నా కూడా ఉండ‌టంతో తెలుగులోనూ సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రోవైపు ఆగ‌స్ట్ 31న ఇక్క‌డ "కోకోకోకిల" అంటూ వ‌చ్చింది న‌య‌న‌తార‌. ఇక్క‌డ సినిమాకు టాక్ తేడాగా వ‌చ్చినా కూడా ఒకే భాష‌లో రెండు వారాల్లో రెండు విజ‌యాల‌తో తాను ఎందుకు నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అని మ‌రోసారి నిరూపించుకుంది న‌య‌న్. ఈ దూకుడు ఇలాగే సాగితే మ‌రో మూడు నాలుగేళ్లైనా కూడా న‌య‌న ప్లేస్ అందుకోవ‌డం మిగిలిన హీరోల‌కు క‌లే. ప్ర‌స్తుతం అజిత్‌తో "విశ్వాసం".. తెలుగులో చిరంజీవితో "సైరా" సినిమాల్లో న‌టిస్తుంది న‌య‌న‌తార‌.
Published by: Praveen Kumar Vadla
First published: August 31, 2018, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading