NAYANATARA AGREED A FREEDOM FIGHTER MOVIE IS SHE READY TO FACE CRITICISM MHN
Nayanatara: హిస్టారికల్ మూవీలో నయనతార.. విమర్శలు ఎదుర్కోక తప్పదా..?
నయనతార (File)
Nayanatara - Vignesh Shivan: దక్షిణాది హీరోయిన్స్‌లో నయనతారకు ఉన్న క్రేజే వేరు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇప్పుడు ఓ వీరవనిత బయోపిక్‌లో నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దక్షిణాది హీరోయిన్స్‌లో నయనతారకు ఉన్న క్రేజే వేరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో యాబై కోట్ల మార్కెట్ ఉన్న హీరోయిన్ నయనతార. తాజాగా ఈమె ఓ హిస్టారికల్ మూవీలో నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే.. సాధారణంగా న్యూ ఇయర్ మొదలవుతుందంటే ముందు డైరీ తీసుకుని కొన్ని డేట్లు బ్లాక్ చేసేస్తుంది నయన్. అందులో తన పుట్టినరోజు, విఘ్నేష్ శివన్ పుట్టినరోజు, ఓనమ్, నానుం రౌడీదాన్ సినిమా రిలీజ్ డేట్ (ఈ సినిమా వల్లే విఘ్నేష్‌తో నయన్‌కి పరిచయం... సో... చాలా స్పెషల్ అన్నమాట)... ఇలాంటి వాటిని వదిలేస్తుంది. మిగిలిన రోజులన్నీ ఫుల్ కావాల్సిందే. ఒకవేళ ఒకటీ అరా రోజు గ్యాప్ కావాలంటే ఏదో ఒక నిర్మాతకు విషయాన్ని చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిందే.
సో 2019 డిసెంబర్‌లోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యింది నయన్. కానీ కోవిడ్ పుణ్యమా అని ప్రియుడుతో బాగా టైమ్ స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ 2020 ఎండింగ్‌లోనూ ఆమె ప్లానింగ్ అలాగే ఉంది.
2021 కాల్షీట్ అన్నీ ఫుల్.. నో మోర్ ఎంక్వయరీ అనే బోర్డు కనిపిస్తోందట నయన్ మేనేజర్ దగ్గర. యస్.. ఇప్పుడు రజనీకాంత్ పక్కన చేస్తున్న అన్నాత్తే, ప్రియుడు విఘ్నేష్‌తో చేస్తున్న కాత్తువాక్కులే రెండు కాదల్, ఇవి కాకుండా మరో రెండు మలయాళ సినిమాలు, ఇప్పుడు మళ్లీ ఓ వీరవనిత చిత్రం.
ఇంతకీ వీరవనిత ఎవరనుకుంటున్నారా? సూర్య భార్య జ్యోతిక చేయాలనుకున్నపాత్ర అన్నమాట. ఆమె పేరు వేలు నాచియార్. బ్రిటిషర్స్ కి ఎదురుతిరిగి పోరాడిన మొట్టమొదటి రాణిగా వేలు నాచ్చియార్కి చరిత్రలో అద్భుతమైన స్థానం ఉంది. ఈ సినిమాకోసం నయన్‌ని అప్రోచ్ అయ్యారు కెప్టెన్ సుశి గణేషన్. నయన్ ఓకే అంటే... ఇక డైరీని ఓపెన్ చేయాల్సిన పనే లేదట. అయితే తమిళులు కొన్ని విషయాల్లో చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. హిస్టారికల్ సినిమాలను తెరకెక్కించేటప్పుడు ఏ మాత్రం తేడా వస్తే విమర్శించడానికి అస్సలు వెనుకాడరు. మరి ఇప్పటికే ఇద్దరు ప్రేమికులను మార్చేసిన నయనతార.. వీర వనిత పాత్రలో నటిస్తే తమిళ తంబీలు ఒప్పుకుంటారా? అనేది చూడాలి.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.