news18-telugu
Updated: August 22, 2018, 4:05 PM IST
కోకో కోకిల ట్విట్టర్ ఫోటో
అవును.. ఇప్పుడు నయనతార నిజంగానే నాగచైతన్య స్థానంపై కన్నేసింది. "శైలజారెడ్డి అల్లుడు" వదిలేసిన విడుదల తేదీని ఎవరు తీసుకుంటారా అని ఆలోచిస్తున్న తరుణంలో నయనతార వచ్చేసింది. ఆగస్ట్ 31న నేనున్నానంటూ వచ్చేస్తుంది. ఈమె నటించిన "కోకో" సినిమా తెలుగులో విడుదల కానుంది.
తమిళనాట గత వారమే విడుదలైన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. ఇప్పటికే 15 కోట్లకు పైగా వసూలు చేసి నయన్ ఇమేజ్ మరింత పెంచేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్మగ్లర్ గా నటించింది నయనతార. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో "కోకో కోయిల"గా ఆగస్ట్ 31న విడుదల చేస్తున్నారు.

naga chaithanya
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై ఇక్కడ కూడా మంచి ఆసక్తి కనిపిస్తుంది. అన్నింటికి మించి ఇప్పటికే యోగిబాబు, నయనతారపై వచ్చిన పాట తెలుగులోనూ సూపర్ పాపులర్ అయింది.
అనిరుధ్ సంగీతం సినిమాకు మరో అదనపు ఆకర్షణ. డబ్బింగ్ సినిమా కదా అని లైట్ తీసుకోడానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ కూడా నయన్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఓపెనింగ్స్ వరకు అయితే ఢోకా లేదు. సినిమా ఇక్కడ కనెక్ట్ అయిందంటే మరో హిట్ ఖాయమే. అన్నట్లు నాగచైతన్య పోరు తప్పిందనుకుంటే నాగశౌర్యకు ఇప్పుడు నయన్ పోరు మొదలైంది. ఆగస్ట్ 30న ఈయన నటిస్తున్న నర్తనశాల విడుదల కానుంది. మొత్తానికి అటు నయన్.. ఇటు నాగశౌర్య పోరు మాత్రం కచ్చితంగా ఆసక్తికరమే.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 22, 2018, 3:55 PM IST