నవాజుద్దీన్ సిద్దిఖీకి చుక్కలు చూపించిన అభిమాని.. ఇంతకీ ఏం జరిగిందంటే..

అభిమాని లేనిదే హీరోలు లేరులే..అనుచరులు లేనిదే నాయకులు లేరులే అని ఒక సినిమాలో పాట ఉంది. తాజాగా ఒక అభిమాని చేసిన ఓవరాక్షన్‌కి బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 26, 2019, 3:01 PM IST
నవాజుద్దీన్ సిద్దిఖీకి చుక్కలు చూపించిన అభిమాని.. ఇంతకీ ఏం జరిగిందంటే..
నవాజుద్దీన్ సిద్దిఖీ
  • Share this:
అభిమాని లేనిదే హీరోలు లేరులే..అనుచరులు లేనిదే నాయకులు లేరులే అని ఒక సినిమాలో పాట ఉంది. హీరోలకు అభిమానులే బలం. కానీ ఒక్కోసారి ఈ అభిమానుల అతితో హీరోలు ఇబ్బందుల పాలు అవుతుంటారు. తాజాగా ఒక అభిమాని చేసిన ఓవరాక్షన్‌కి బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నాడు.

వివరాల్లోకి వెళితే..నవాజుద్దీన్ సిద్దిఖీ ‘రాత్ అకేలీ హై’ అనే చిత్ర షూటింగ్ కోసం కాన్పూర్ వెళ్లాడు. అక్కడ నవాజుద్దీన్‌ను  కొంత మంది అభిమానులు చుట్టు ముట్టి అతనితో సెల్ఫీలు దిగారు. ఇక నవాజుద్దీన్ కూడా ఆ ఫ్యాన్స్‌తో ఎంతో ఓపికగా ఫోటోలకు ఫోజులిచ్చాడు.

అక్కడున్న మరికొంత మంది అభిమానులు ఆయన్ని చుట్టుముట్టగా నవాజుద్దీన్ అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసాడు. కానీ ఓ అభిమాని మాత్రం నవాజుద్దీన్‌ను వెనక్కి లాగేసి మరి ..సెల్ఫీ తీసుకోబోయాడు. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై ఆయన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

Crazy selfie fan #nawazudinsiddiqui #kanpur

A post shared by Viral Bhayani (@viralbhayani) on
సదరు అభిమాని నవాజుద్దీన్‌తో ఫోటో దిగాలనుకోవడం తప్పు కాకపోయినా..ఆయన్ని ఇబ్బంది పెట్టి మరి ఈ ఫోటో తీసుకోవడాన్ని మాత్రం కొంత మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు.
First published: February 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>