నవాజుద్దీన్ సిద్దిఖీ.. తన నటనలో మాత్రమే కాకుండా సినిమాల్ని ఎంపిక చేసుకోవడంలో కూడ ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తారు. అందుకు ఉదాహరణ ఆయన చేసిన సినిమాలే.. ఒక్కో సినిమా .. ఒక్కో జానర్‌లో ఉంటూ.. తాను చేస్తోన్న పాత్రల్లో ఒదిగిపోతూ.. తాను మాత్రమే చెయగలడు అనే విధంగా తన నటనతో తెరపై అద్భుతాన్ని సృష్టిస్తాడు. అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్‌లో గ్యాంగ్ స్టర్‌గా గాని.. మాంటోలో సాదత్ మాంటోగ కానీ.. రీసెంట్‌గా ఫోటోగ్రాఫ్ అనే వెబ్ సిరీస్‌లో రఫిగా.. ఇలా ఏ పాత్రలోనైనా... పరకాయ ప్రవేశం చేస్తూ.. తన నటనతో కట్టి పడేస్తాడు.
అది అలా ఉంటే.. ప్రస్తుతం దక్షిణాది సినిమాల మేకింగ్, కాన్సెప్ట్ విషయాల్లో హిందీ సినిమాలతో దీటుగా ఉంటూ వాటితో పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా పలువురు బాలీవుడ్ స్టార్స్ దక్షిణాది సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో ముఖ్యంగా.. నానాపటేకర్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, బోమన్ ఇరానీ.. ఇలా చాలా మంది ప్రముఖ హిందీ నటులు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. విక్టరీ వెంకటేశ్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ చిత్రంలో నవాజ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.
హుమా ఖురేషి హాట్ పిక్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Movie News