Navya Swamy : సీరియల్ నటి నవ్య స్వామి అభిమానులకు గుడ్ న్యూస్..

Navya Swamy Photo : Instagram

Navya Swamy : నాపేరు మీనాక్షి సీరియల్‌తో సూపర్ పాపులర్ అయిన నవ్య స్వామికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

  • Share this:
    Navya Swamy : నాపేరు మీనాక్షి సీరియల్‌తో సూపర్ పాపులర్ అయిన నవ్య స్వామికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే షో నిర్వాహకులు కంటెస్టెంట్స్‌ను ఖరారు చేస్తున్నారు. ఈ సారి ఎక్కువ మంది సెలెబ్రీటీస్, పాపులర్ ఫేస్‌లు ఉండేలా చూస్తున్నారట. అందులో భాగంగా ప్రముఖ టీవీ నటి నవ్యస్వామి ఈ సీజన్’‌లో పాల్గోననుందని తెలుస్తోంది. ఈ బ్యూటీకి బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు షోలో పాల్గోనేందుకు భారీగా ఆఫర్ చేశారట. దీంతో ఆమె అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఇక నవ్వస్వామి విషయానికి వస్తే.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్యకు డాక్టర్ కావాలని కోరిక ఉండేదట. అయితే ఓసారి ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన 'తంగళి' సీరియల్ అక్కడ మంచి విజయాన్ని పొందింది. ఆ తర్వాత నవ్య స్వామీ తమిళ సీరియల్ 'వాణీ రాణీ'లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత నవ్వ స్వామికి తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. పలు సీరియల్స్‌తో పాటు ప్రస్తుతం నవ్య 'ఆమెకథ' సీరియల్‌లో నటిస్తూ పాపులర్ అయ్యింది.








    View this post on Instagram






    A post shared by STAR MAA (@starmaa)





    ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఈ సారి కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఐదో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సివుంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్ వచ్చే సెప్టెంబర్ 5వ తేదిన మొదలు పెట్టాలనీ నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








    View this post on Instagram






    A post shared by Navya Swamy (@navya_swamy)





    ఇక ఈ ఐదో సీజన్ కోసం అప్పుడే నిర్వహకులు కంటెస్టెంట్ లిస్ట్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ గెటప్ శ్రీను, రఘు మాస్టర్, సింగర్ మంగ్లీ, న్యూస్ యంకర్ రోజా, నటి సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు ఉన్నారని టాక్.
    Published by:Suresh Rachamalla
    First published: