NAVIN POLISHETTY DOING TWO MOVIES WITH HUGE REMUNARATION MHN
Navin Polishetty: రెండు ప్రముఖ బ్యానర్స్‌లో నవీన్ పొలిశెట్టి మూవీస్.. భారీగా రెమ్యునరేషన్!
Navin Polishetty doing two movies with huge remunaration
Navin Polishetty: ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి తదుపరి సినిమాలపై మంచి క్రేజ్ నెలకొంది. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ రెమ్యునరేషన్స్తో నవీన్ పొలిశెట్టి సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం.
ఏదైనా ఒక్క సినిమా హిట్టయితే చాలు ఇక ఆ సినిమాలో నటించిన హీరోకు గానీ... హీరోయిన్‌కు గానీ వరుస ఆఫర్లు వచ్చి పడుతుంటాయ్. ‘మేం సినిమా తీస్తాం’ అని నిర్మాణ సంస్థలు, మా దగ్గర కథ రెడీగా ఉంది సార్.. మీరు ఓకే అంటే పట్టాలెక్కించేద్దాం అని దర్శకులు తెగ క్యూ కట్టేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకించి ఉదాహరణలేమీ చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయ్. అలా ఒక్క సినిమాతో ఇప్పుడు స్టార్ హీరోలుగా.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవాళ్లు చాలా మందే ఉన్నారు. అసలు విషయానికొస్తే.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ గా టాలీవుడ్‌కు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టి ‘జాతిరత్నం’ (జాతిరత్నాలు)గా పేరుతెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆయనకోసం పేరుగాంచిన రెండు ప్రముఖ బ్యానర్సే వెయిట్ చేస్తున్నాయని కుర్ర హీరో రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు బ్యానర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగుతోంది. అందుకు కారణం ‘జాతిరత్నాలు’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడమే. ఇలాగే ఇంకో రెండు మూడు హిట్లు పడితే నవీన్.. స్టార్ హీరోల సరసన చేరిపోతారనే టాక్ కూడా హాట్ హాట్‌గానే నడుస్తోంది. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ మూవీతో వచ్చిన టాక్‌తో ఆయన్ను ప్రముఖ బ్యానర్స్ అయిన ‘యువీ క్రియేషన్స్’, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’లో సినిమాలు చేయాలని నవీన్‌ను సంప్రదించగా.. టాప్ బ్యానర్స్ కావడంతో ఏ మాత్రం ఆలోచించుకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
టాలీవుడ్లో పేరు పొందిన బ్యానర్స్‌లో యూవీ క్రియేషన్స్ టాప్‌లో ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ విజయవంతంగా సాగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బ్యానర్ ఏదైనా సినిమాకు చెప్పినా.. మీ బ్యానర్లో సినిమా చేస్తామని సంప్రదించినా దాని రేంజే వేరుగా ఉంటుందని టాక్. ఎందుకంటే ఆ సినిమా పక్కాగా హిట్ అవుతుందని ఒక నమ్మకం అన్నమాట. సితార ఎంటర్టైన్మెంట్ పరిస్థితి కూడా అంతే. అందుకే ఈ రెండు బ్యానర్స్‌లో చేస్తే తనకు మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయని భావించి నవీన్ ఒప్పుకున్నాడట.
ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే.. ఈ బ్యానర్స్‌లో సినిమాలు చేయడానికి ఇప్పటికే రెమ్యునరేషన్ కూడా మాట్లాడేసుకున్నారట. ఒక్కోదానికి మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని లీకులు వస్తున్నాయ్. ఇంత భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇస్తున్నారంటే.. సినిమా ఏ రేంజ్లో ఉంటుందో..? సినిమా తీయడానికి ఇంకెన్ని కోట్లు ఖర్చుపెడతారో..? అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న ఈ విషయంపై పూర్తిగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో..? అధికారికంగా ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.