Home /News /movies /

NAVIN MPOLISHETTY JATHI RATHNALU COLLECTING GOOD COLLECTIONS AT US BOX OFFICE MHN

Navin polishetty: ఓవర్ సీస్‌లో ‘జాతిరత్నాలు’ సరికొత్త రికార్డ్... నవీన్ పొలిశెట్టి క్రేజ్ పెరిగినట్లేనా?

Navin mpolishetty Jathi Rathnalu collecting good collections at US box office

Navin mpolishetty Jathi Rathnalu collecting good collections at US box office

Navin polishetty: నవీన్ పొలిశెట్టి , ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన ‘జాతిరత్నాలు’ చిత్రం యు.ఎస్‌లో వసూళ్లు పరంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

    ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’తో స‌క్సెస్ కొట్టిన న‌వీన్ పొలిశెట్టి ఇక సోలో హీరోగా సెటిలవుతాడ‌ని అంద‌రూ అనుకుంటే.. త‌ను మాత్రం వైవిధ్యానికి ప్రాధాన్య‌త ఇస్తూ ఓ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌డానికి ముందుకు వ‌చ్చాడు. ఆ సినిమాయే ‘జాతి రత్నాలు’. శివరాత్రి సంద‌ర్భంగా మార్చి 11న విడుద‌లైన ఈ సినిమా న‌వీన్ పొలిశెట్టి కెరీర్‌లో మ‌రో హిట్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్ మార్కెట్ అయిన అమెరికాలో ‘జాతి రత్నాలు’ ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

    ఇంత‌కీ ‘జాతి రత్నాలు’ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే.. ఈ సినిమాను యు.ఎస్‌లో విడుద‌ల చేశారు. 67 లొకేష‌న్స్‌లో స‌రాస‌రిగా 1832 డాల‌ర్స్ చొప్పున 1.22810 డాల‌ర్స్‌ను తొలిరోజున ఈ చిత్రం వ‌సూలు చేసింది. కోవిడ్ ప్ర‌భావంతో అమెరికాలో తెలుగు సినిమాల‌కు మార్కెట్ డౌన్ అయిన ఈ నేప‌థ్యంలో ఇంత రేంజ్‌లో మార్కెట్ క్రియేట్ చేయ‌డం చిన్న విష‌యం కాద‌ని..ఆ విష‌యంలో ‘జాతి రత్నాలు’ ఓ రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్లేన‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

    దీంతో హీరోగా న‌వీన్ పొలిశెట్టి రెండో సినిమాతో మ‌రో హిట్ కొట్టాడు. సినిమాకు వ‌చ్చిన టాక్‌, వ‌స్తున్న క‌లెక్ష‌న్స్ చూస్తుంటే ‘జాతి రత్నాలు’ మ‌రో ఉప్పెన త‌ర‌హాలో మంచి వ‌సూళ్ల‌నే సాధించేలా ఉంద‌ని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. న‌వీన్ శెట్టి హీరోగా మ‌రో రేంజ్‌కి వెళ్లిన‌ట్లేన‌ని అంద‌రూ భావిస్తున్నారు.
    Published by:Anil
    First published:

    Tags: Jathi Ratnalu, Naveen Polishety

    తదుపరి వార్తలు