బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాపై యువ హీరో క్లారిటీ..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పరిచమైన నవీన్ పోలిశెట్టి నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దానిపై ఈ యువహీరో క్లారిటీ ఇచ్చాడు.

news18-telugu
Updated: April 28, 2020, 8:55 PM IST
బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాపై యువ హీరో క్లారిటీ..
బాలయ్య, నవీన్ పోలిశెట్టి (Twitter/Photo)
  • Share this:
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా.  గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’.‘లెజెండ్’ సినిమాలు ఒకదాన్ని మించి మరోకటి సూపర్ హిట్ కావడంతో వీళ్ల కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  అది అలా ఉంటేఈ సినిమా మొదలైప్పటి నుండి రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్‌ పొలిశెట్టి ఈ సినిమాలో హీరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు నవీన్‌ పొలిశెట్టి ఈ సినిమాలో బాలయ్యకు అసిస్టెంట్‌గా కనిపిస్తాడని టాక్ వినపడుతోంది.తాజాగా ఈ సినిమాలో తాను నటించడంపై నవీన్ పోలిశెట్టి స్పందించారు. నేను బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాలో ఎలాంటి పాత్రలో నటించడం లేదు. ఆ వార్తలు అవాస్తం అంటూ కొట్టిపారేసాడు.  ప్రస్తుతం నేను జాతి రత్నాలు అనే సినిమా చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ వాళ్లు తెరకెక్కిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

Naveen Polishety denies the rumours of doing balakrishna nbk 106 movie with Boyapati srinu,Balakrishna,balakrishna nandamuri, balakrishna boyapati srinu Naveen polishety,naveen polishetty Twitter,naveen polishetty instagram,balakirshna twitter,balakrishna instagram,balakrishna and boyapati film,  boyapati film, balakrishna films, బోయపాటి సినిమాలు,బాలయ్య సినిమాలు, నవీ, న్ పొలిశెట్టి, తెలుగు సినిమా వార్తలు,నవీన్ పోలీశెట్టి,నవీన్ పోలిశెట్టి
బాలకృష్ణ, నవీన్ పోలిశెట్టి (Twitter/Photo)


ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని రూమర్స్ వినపడ్డాయి. అయితే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ కనిపించనుందని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఇక ఈ సినిమా కొంత షూటింగ్ జరుపుకోగా.. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
First published: April 28, 2020, 8:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading