నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నవీన్ జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టి.. ప్రస్తుతం టాలీవుడ్లో ఇప్పుడో హాట్ కేక్‌గా మారారు. వరుసగా తను హీరోగా వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అందులో భాగంగా ఆయన హీరోగా చేస్తోన్న మరో చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. నవీన్ పొలిశెట్టి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో ఓ సినిమా రూపొందనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా టైటిల్ ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు అనగనగా ఒక రాజు అనే పేరును టైటిల్‌గా ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించి టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ టైటిల్ టీజర్ నెటిజన్స్ బాగానే ఆకట్టుకుంటోంది. అంతేకాదు ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఇప్పటికే ఈ టీజర్ మూడు మిలియన్ వ్యూస్’తో కేక పెట్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
సాయి సౌజన్య ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్‌పై సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకు ‘జాతి రత్నాలు’ దర్శకత్వ శాఖలో పని చేసిన కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అన్ని కార్యక్రామాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర టెక్నికల్ సిబ్బంది గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Spectacular response to young sensation @NaveenPolishety's 𝐀𝐍𝐀𝐆𝐀𝐍𝐀𝐆𝐀 𝐎𝐊𝐀 𝐑𝐀𝐉𝐔👑 Title Teaser 💥
నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. యూవీ ప్రోడక్షన్స్‌లో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్కహీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మహేష్ అనే కొత్త డైరెక్ట్ చేయనున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ సినిమాతో పాటు నవీన్ స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాను, మహేష్ బాబు బ్యానర్లో ఓ సినిమాను చేయనున్నారని తెలుస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.