హోమ్ /వార్తలు /సినిమా /

Naveen Polishetty | Trivikram : నవీన్ పొలిశెట్టి- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. అధికారిక ప్రకటన..

Naveen Polishetty | Trivikram : నవీన్ పొలిశెట్టి- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. అధికారిక ప్రకటన..

మరోవైపు ఎన్టీఆర్, చరణ్ కూడా కొన్ని రోజుల పాటు కుటుంబంతోనే ఉండబోతున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క కూడా కరోనా భయంతో నవీన్ పొలిశెట్టి సినిమాకు డేట్స్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒక్కరు ఇద్దరు కాదు.. చాలా మంది హీరో హీరోయిన్లు కరోనా కారణంగా అసలు షూటింగ్ చేయడమే మానేసారు. ఇప్పుడున్న తీరు ఇలాగే కొనసాగితే మరో రెండు నెలల వరకు టాలీవుడ్ షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

మరోవైపు ఎన్టీఆర్, చరణ్ కూడా కొన్ని రోజుల పాటు కుటుంబంతోనే ఉండబోతున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క కూడా కరోనా భయంతో నవీన్ పొలిశెట్టి సినిమాకు డేట్స్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒక్కరు ఇద్దరు కాదు.. చాలా మంది హీరో హీరోయిన్లు కరోనా కారణంగా అసలు షూటింగ్ చేయడమే మానేసారు. ఇప్పుడున్న తీరు ఇలాగే కొనసాగితే మరో రెండు నెలల వరకు టాలీవుడ్ షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Naveen Polishetty | Trivikram : నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నవీన్ జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇప్పుడో హాట్ కేక్‌గా మారారు. అది అలా ఉంటే నవీన్ పొలిశెట్ట, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది.

ఇంకా చదవండి ...

  నవీన్ పొలిశెట్టి  (Naveen Polishetty )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నవీన్ జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇప్పుడో హాట్ కేక్‌గా మారారు. వరుసగా తన హీరోగా వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే తాజాగా నవీన్ పొలిశెట్టి నుంచి తరువాత ప్రాజెక్ట్ పై అఫిషియల్ గా ప్రకటన వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో ఓ సినిమా రూపొందనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ వీడియో ద్వారా తెలియజేశారు చిత్రదర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ వహించడం లేదు. ఆయన నిర్మాతగా వ్యవరించనున్నారు.

  ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ అనే బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మించనున్నారు.

  ఇక ఈ సినిమాకు ‘జాతి రత్నాలు’ దర్శకత్వ శాఖలో పని చేసిన కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అన్ని కార్యక్రామాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర టెక్నికల్ సిబ్బంది గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. అందులో భాగంగా నవీన్ పొలిశెట్టి.. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్‌లో ఓ సినిమాను చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకుడు అని తెలుస్తోంది. భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు వెంకీ. ఆ సినిమా తర్వాత వెంకీ కుడుముల మహేష్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేసారు. ఈ సినిమాపై ఓ ప్రకటన అతి త్వరలో విడుదలకానుందని సమాచారం.

  ఇక నవీన్ ఈ సినిమాతో పాటు యూవీ ప్రోడక్షన్స్‌లో మరో సినిమాను కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోందని అన్నారు. కానీ ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన విడుదలకాలేదు. ఈ సినిమాను మహేష్ అనే కొత్త డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు.

  ఇక ఈ సినిమాతో పాటు నవీన్ స్టార్ ప్రోడ్యూసర్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాను చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడట. దీనిపై కూడా త్వరలో ఓ ప్రకటన రావల్సి ఉంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Anushka Shetty, Naveen Polishety, Tollywood news, Trivikram Srinivas

  ఉత్తమ కథలు