NAVEEN POLISHETTY NAG ASHWIN ANUDEEP COMEDY DRAMA JATHI RATNALU 25 DAYS WORLDWIDE COLLECTIONS PK
Jathi Ratnalu 25 days collections: 'జాతి రత్నాలు' 25 డేస్ కలెక్షన్స్.. 11 కోట్లకు అమ్మితే ఎంత వచ్చిందంటే..!
జాతి రత్నాలు (Jathi ratnalu)
Jathi Ratnalu 25 days collections: నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), ఫరియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన జాతి రత్నాలు బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. నిజంగానే వాళ్లు బాక్సాఫీస్ జాతి రత్నాలు (Jathi Ratnalu)అయిపోయారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 25 రోజుల కలెక్షన్స్ మీ కోసం..
2021 చిన్న సినిమాలకు బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు అంచనాలకు మించి వసూళ్లు సాధించాయి. మీడియం బడ్జెట్‌తోనే వచ్చిన సినిమాలు నిర్మాతలకు 30-40 కోట్ల లాభాలు తీసుకొచ్చాయి. అలాంటి సినిమాల్లో జాతి రత్నాలు కూడా ఉంటుంది. నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన జాతి రత్నాలు తొలిరోజు నుంచే సంచలన వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే 11 కోట్ల లక్ష్యం పూర్తి చేసుకుని మూడు వారాల పాటు బాగా ఆడింది. 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా 25 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..
ఏపీ + తెలంగాణ 25 రోజుల మొత్తం: 32.45 కోట్లు (54 కోట్ల గ్రాస్) రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.71 కోట్లు ఓవర్సీస్: 4.25 కోట్లు
వరల్డ్ వైడ్ 25 డేస్ టోటల్: 38.76 కోట్లు షేర్ (68 కోట్ల గ్రాస్)
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.