Home /News /movies /

NAVEEN POLISHETTY JATHI RATNALU MOVIE 1ST WEEKEND WORLDWIDE COLLECTIONS PK

Jathi Ratnalu 1st weekend collections: ‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నవ్వుల జాతరకు వసూళ్ల వర్షం..

జాతి రత్నాలు కలెక్షన్స్ (Jathi Ratnalu)

జాతి రత్నాలు కలెక్షన్స్ (Jathi Ratnalu)

Jathi Ratnalu 1st weekend collections: కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ కళ లేదు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు జాతి రత్నాలు వచ్చారు.

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ కళ లేదు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు జాతి రత్నాలు వచ్చారు. ఈ చిత్రం సంచలనం విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టించారు జాతి రత్నాలు. నాలుగో రోజు కూడా సంచలన వసూళ్లు సాధించింది. లాంగ్ వీకెండ్ పూర్తిగా వాడుకుని నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల షేర్ వసూలు చేసింది జాతి రత్నాలు. సోమవారం కూడా చాలా చోట్ల ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. లాజిక్ లేని మ్యాజిక్ అంటూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు.

ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ వసూళ్లు..

నైజాం - 7.07 కోట్లు
సీడెడ్ - 2.8 కోట్లు
ఉత్తరాంధ్ర - 2.31 కోట్లు
నెల్లూరు - 59 లక్షలు
కృష్ణ - 1.07 కోట్లు
గుంటూరు - 1.31 కోట్లు
వైజాగ్ - 96 లక్షలు
ఈస్ట్ - 97 లక్షలు
వెస్ట్ - 97 లక్షలు

AP +TS 4 రోజుల వసూళ్లు- 16.52 కోట్ల షేర్
రెస్టాఫ్ ఇండియా - 61 లక్షలు
ఓవర్సీస్ - 3.31 కోట్లు

వరల్డ్ వైడ్ 4 డేస్ వసూళ్లు - 20.44 కోట్లు షేర్
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jathi Ratnalu, Naveen Polishety, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు