టాలీవుడ్ యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి .. నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో వరుసగా రెండు హిట్లు అందుకున్నాడు. తాజాగా నవీన్ తన మూడో సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్నారు. ఇందులో ప్రముఖ హీరోయిన్ అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. అందాల తార అనుష్క శెట్టి తో పాటు నవీన్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్ స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.
అనుష్క శెట్టి నటిస్తోన్న ఈ సినిమాను ప్రభాస్‌కు చెందిన UV క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అన్విక రవళి శెట్టి పాత్రలో అనుష్క శెట్టి కనిపించబోతుంది. అంటే రాబోయే సినిమాలో అనుష్క శెట్టిని వంటలక్క పాత్రలో చూడొచ్చన్న మాట. అయితే ఈ సినిమాకు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే పేరు ఎప్పట్నుంచో రూమర్స్‌లో ఉంది. దీనికి తగ్గట్లే ఈ సినిమాలో సిద్ధు పోలిశెట్టి అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడని ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్‌కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుష్కకు 48వ చిత్రమిది. 'మిర్చి', 'భాగమతి' విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty, Naveen polishetty