Natyam :ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన తాజా సినిమా ‘నాట్యం’. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, ‘శుభలేఖ’ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా చూసి బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రశంసలు కురిపించారు.
తాజాగా ‘నాట్యం’ చిత్రం చూసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చూసి ప్రశంసల ఝల్లు కురిపించారు. నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ చిత్రంపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. ఇక అది అలా ఉంటే అసలు ఆ నాట్యం హీరోయిన్ సంధ్యా రాజు ఎవరు.. అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. సడెన్‌గా వచ్చి ఇంత పెద్ద సినిమా ఎలా తీశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రామ్ చరణ్ హాజరు కావడం ఏంటీ.. ఎన్టీఆర్ టీజర్‌ను విడుదల చేయడం ఏంటీ అని చర్చించుకుంటున్నారు.
Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..
పెద్దగా పేరు లేని సంధ్యారాజు హీరోయిన్‌గా పరిచయం అవుతుంటే ఆమెకు ఉపాసన, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం మీద చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ అయితే ఏకంగా హైదరాబాద్‌లోని సంధ్యా రాజు ఆఫీస్‌కి వెళ్లి టీజర్‌ను విడుదల చేశారు. స్వయంగా ఎన్టీఆర్ వెళ్లి రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. సంధ్య రాజు బ్యాగ్ గ్రౌండ్ చాలా పెద్దది అని తెలుస్తోంది. సంధ్య రాజు ఒక మంచి కూచిపూడి నృత్యకారిణి మాత్రమే కాదు.. ఒక బిగ్ పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు.. అంతేకాదు మరో పెద్ద బిజినెస్ మ్యాన్ కోడలు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్పనున్నారా.. ?
సంధ్యా రాజు ప్రముఖ వ్యాపారవేత్త మల్టీ మిలియనీర్ రామ్‌కో గ్రూప్ చైర్మన్ పి.ఆర్. వెంకట్రామ రాజా కుమార్తె. అంతేకాదే సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు కోడలు.. రామలింగరాజు చిన్న కుమారుడిని వివాహమాడారు సంధ్య రాజు. సంధ్యా రాజు రామ్ కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నారు. సంధ్య రాజు.. వెంపటి చిన్న సత్యం దగ్గర నాట్యం నేర్చుకుని.. ఇప్పటి వరకు 1000 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chiranjeevi, Natyam Movie, Tollywood, Venkaiah Naidu, Vice President of India