హోమ్ /వార్తలు /సినిమా /

Suwarna Sundari: పూర్ణ ప్రధాన పాత్రలో సువర్ణ సుందరి.. రిలీజ్ డేట్ ఫిక్స్

Suwarna Sundari: పూర్ణ ప్రధాన పాత్రలో సువర్ణ సుందరి.. రిలీజ్ డేట్ ఫిక్స్

Suwarna Sundari (Photo twitter)

Suwarna Sundari (Photo twitter)

Actress Poorna: ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’ (Suwarna Sundari). కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’ (Suwarna Sundari). సురేంద్ర మాదారపు (Surendra Madharapu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ (ML Laxmi) నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీని.. ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో నిలబెట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి, రాజమౌళిగారికి ధన్యవాదాలు. ‘సువర్ణసుందరి’ సినిమా విషయానికి వస్తే.. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌‌కు చాలా మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాని ఇప్పటికే విడుదల చేయాల్సింది. కరోనా ప్రభావంతో రిలీజ్ పోస్ట్‌పోన్ చేసి.. మంచి సమయం కోసం వేచి చూస్తూ వచ్చాం.

అయితే రీసెంట్‌గా పీఆర్వో వీరబాబు గారు ఈ సినిమా చూసి.. ఇంత మంచి సినిమాని ఎందుకు ఇంకా విడుదల చేయకుండా ఆపారు. వెంటనే విడుదల చేయండి.. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పడమే కాకుండా.. ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లే బాధ్యతని కూడా ఆయనే తీసుకున్నారు. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్.. టెక్నికల్‌గా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అలరింపజేస్తుంది. సినిమాని ఫిబ్రవరి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాము. ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుతున్నాము..’’ అని అన్నారు.

PRO వీరబాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు సూర్య‌గారు 10 సంవత్సరాలుగా తెలుసు. ఆయన సినిమాలకు నేను పీఆర్వోగా వర్క్ చేశాను. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘సువర్ణసుందరి’ చిత్రాన్ని నేను చూడటం జరిగింది. కరోనాకు ముందు విడుదల తేదీని ప్రకటించి భారీగా పబ్లిసిటీ కూడా చేశారు. కానీ కరోనా విలయతాండవం చేయడంతో.. విడుదల వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. నేను ఈ సినిమా చూసిన తర్వాత.. ఇంత మంచి సినిమాని విడుదల చేయకుండా ఆపేశారేంటి? వెంటనే విడుదల చేయండి అంటూ పట్టుబట్టాను. ఎందుకంటే ఈ సినిమాలో సాయి కార్తీక్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక లెవల్‌లో ఉంది. అలాగే జయప్రదగారు, పూర్ణగారు, సాక్షి చౌదరి వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతంగా నటించారు. కంటెంట్ పరంగా కానివ్వండి.. విజువల్‌గా కానివ్వండి.. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఫిబ్రవరి 3న థియేటర్లలోకి వస్తుంది. మంచి సినిమా.. ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది..’’ అని అన్నారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actress

ఉత్తమ కథలు