హోమ్ /వార్తలు /సినిమా /

Shyam Singha Roy Twitter Review : ‘శ్యామ్ సింగరాయ్’ ట్విట్టర్ రివ్యూ.. నాని ఇరగదీసాడా..

Shyam Singha Roy Twitter Review : ‘శ్యామ్ సింగరాయ్’ ట్విట్టర్ రివ్యూ.. నాని ఇరగదీసాడా..

నాని ‘శ్యామ్ సింగరాయ్’ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

నాని ‘శ్యామ్ సింగరాయ్’ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

Nani Shyam Singha Roy Twitter Review : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా మూవీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానుల స్పందన ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

Nani Shyam Singha Roy Twitter Review : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా మూవీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే  విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా ఈ రోజు ( డిసెంబర్ 24) న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా యూనిట్ జోరు పెంచిన సంగతి తెలిసిందే కదా.

ఈ రోజు విడుదలైన  ఈ సినిమా పలు ప్రాంతాలతో పాటు యూఎస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించారు.  ‘శ్యామ్ సింగరాయ్’లో నాని టూ డిఫరెంట్ లుక్స్ లో నాని కనిపిస్తున్నారు. కోల్‌‌కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సత్యదేవ్ జంగా కథ అందించారు. నాని కెరీర్‌లోనే తొలిసారి రూ.  40 కోట్లతో బడ్జెట్‌తో  తెరకెక్కింది. ఇక రెండేళ్ల తర్వాత నాని హీరోగా నటించిన చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. గతంలో రెండు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం కచ్చితంగా అభిమానుల అంచనాలు నిలబెట్టేలా ఉందా లేదా మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి ప్రేక్షకులు. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ ‘శ్యామ్ సింగరాయ్’ పాత్రలో అదరగొట్టినట్టు చెబుతున్నారు.

మరికొంత మంది సెకండ్ హాస్ ఏ మంత ఆసక్తి లేదు అంటూ మరికొందరు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి, సెన్సేషనల్ సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఎంసిఏ సినిమాలో కలిసి నటించిన నాని, సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ కోసం మరోసారి కలిసారు. ఇప్పటి వరకు సాయి పల్లవి చేయనటువంటి భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో పోషించారు. మొత్తంగా నాని సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో ఒదిగిపోయాడనే కామెంట్స్ వినబడుతున్నాయి.

First published:

Tags: Nani, Shyam Singha Roy, Shyam Singha Roy Movie Review, Tollywood

ఉత్తమ కథలు