వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని నటనను అందరు మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు టాలీవుడ్ అగ్ర నటులు నాని నటనను మెచ్చుకుంటున్నారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా ఒక క్రికెటర్‌గా, ప్రేమికుడిగా,సగటు భర్తగా, తండ్రిగా నాని నటనను అందరు మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా మొదటి రోజు వాల్డ్ వైడ్‌గా రూ.7 కోట్లు రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమా ఒక లక్ష 45 వేల డాలర్స్‌ను రాబట్టినట్టు సమాచారం.
మొత్తానికి నాని కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. నాని గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా తక్కువ రేటుకే థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోవడం..సూపర్ హిట్ టాక్ రావడం ‘జెర్సీ’ సినిమాకు కలిసి వచ్చే అంశాలు. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ‘జెర్సీ’ జైత్రయాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Box Office Collections, Jersey movie review, Jr ntr, Nani, Shraddha Srinath, Tollywood, Tollywood Box Office Report